అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Srisailam Reservoir | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది. ఎగువన కర్ణాటక, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కృష్ణానది ఉప్పొంగి ప్రవహిస్తోంది.
కర్ణాటకలోని ఆల్మట్టి (Almatti), నారాయణపూర్ రిజర్వాయర్లు ఇప్పటికే నిండాయి. దీంతో గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఆల్మట్టి డ్యామ్‌కు ప్రస్తుతం 1,03,773 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. గేట్లు ఎత్తి 1,10,000 క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి మట్టం 123 టీఎంసీలు కాగా ప్రస్తుతంం 112.294 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నారాయణపూర్ జలాశయం సైతం నిండింది. తుంగభద్ర నది కూడా ఉప్పొంగి ప్రవహిస్తోంది. దీంతో జూరాల మీదుగా శ్రీశైలం జలాశయానికి భారీగా వరద వస్తోంది.
Srisailam Reservoir | 72 టీఎంసీలకు చేరిన నీటినిల్వ
జూరాల ప్రాజెక్ట్ (Jurala Project)కు భారీగా వరద వస్తుండటంతో.. విద్యుత్ ఉత్పత్తి, గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో శ్రీశైలం జలాశయానికి 1.63 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తోంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 72.2 టీఎంసీల నీరు నిల్వ ఉంది. కృష్ణా నదీ పరీవాహక ప్రాంతం, పశ్చిమ కనుమలలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో శ్రీశైలం జలాశయానికి రానున్న రోజుల్లో భారీగా వరద పెరిగే అవకాశం ఉంది. ఇలాగే వరద కొనసాగితే వారం రోజుల్లో శ్రీశైలం ప్రాజెక్ట్ నిండుతుంది.
Srisailam Dam continues to get massive flood from Jurala dam releases.
Current Inflow – 1,63,650 Cusecs
Storage – 72.2 TMC/215.8 TMC
Meanwhile Jurala dam discharging 1,78,000 Cusecs into Krishna River. pic.twitter.com/OSmZ2zsQJ2
— Naveen Reddy (@navin_ankampali) August 2, 2026
ఇది కూడా చదవండి : Telangana Nominated Posts | నామినేటెడ్ పదవుల భర్తీకి కాంగ్రెస్ కసరత్తు..సీనియర్లకు పెద్దపీట, ఆశావహుల్లో పెరిగిన ఆశలు