అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Lashkar Bonalu | హైదరాబాద్ (Hyderabad) నగరంలో బోనాల సందడి కొనసాగుతోంది. సికింద్రాబాద్‌లోని ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాలు ఆదివారం ఘనంగా ప్రారంభం అయ్యాయి.
లష్కర్ బోనాల సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రంలో సమృద్ధి వర్షాలతో పాడి పంటలతో ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించినట్లు ఆయన తెలిపారు. బోనాల ఉత్సవాల్లో ప్రజల ఆకాంక్షలకనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. ఆలయానికి పెద్ద ఎత్తున భక్తులు వస్తుండటంతో ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
Lashkar Bonalu | తరలివచ్చిన భక్తులు
లష్కర్ బోనాల నేపథ్యంలో మహంకాళి అమ్మవారి దర్శనం కోసం ఉదయం నుంచే భక్తులు తరలి వచ్చారు. అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకుంటున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఆలయానికి భక్తులు తరలిరావడంతో రద్దీ నెలకొంది. ఈ క్రమంలో వారికి ఎలాంటి ఇబ్బందులు కలకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. సాధారణ భక్తుల కోసం మూడు క్యూలైన్లు, బోనం సమర్పించే భక్తుల కోసం రెండు క్యూలైన్లు ఏర్పాటు చేశారు. జాతర సందర్భంగా ఆలయ పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఏస్తున్నారు. ఈ నెల 4 వరకు ఆలయం చుట్టూ రెండుకిలోమీటర్ల పరిధిలో ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు అమలు చేస్తున్నట్ఉల ట్రాఫిక్ జాయింట్ కమిషనర్ జోయల్ డేవిస్ తెలిపారు.
ఇది కూడా చదవండి : Us Iran War | ట్రంప్ కీలక నిర్ణయం.. ఇరాన్‌తో యుద్ధానికి తాత్కాలిక బ్రేక్..!