Hardik Pandya | తిరుమల శ్రీవారిని దర్శించుకున్న హార్దిక్​ పాండ్యా

భారత్​ క్రికెటర్​ హార్దిక్​ పాండ్యా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన గర్ల్​ ఫ్రెండ్​ మహికా శర్మతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్​ : Hardik Pandya | భారత్​ క్రికెటర్​ హార్దిక్​ పాండ్యా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. తన గర్ల్​ ఫ్రెండ్​ మహికా శర్మతో కలిసి సుప్రభాత సేవలో పాల్గొన్నారు.

భారత ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్యాకు గతంలో విడాకులు అయిన విషయం తెలిసిందే. అనంతరం పాండ్యా మహికా శర్మతో ప్రేమలో పడ్డాడు. శనివారం రాత్రి వీరు తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం తెల్లవారుజామున స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు. దర్శనం అనంతరం అర్చకులు ఆయనకు వేద ఆశీర్వచనాలు అందించి, తీర్థ ప్రసాదాలను అందజేశారు.

Hardik Pandya | తలానీలాలు సమర్పించి..

వేంకటేశ్వర స్వామి వారికి పాండ్యా తలానీలాలు సమర్పించారు. అనంతరం స్వామివారిని దర్శించుకున్నారు. పాండ్యాతో ఫొటోలు దిగడానికి పలువురు అభిమానులు పోటీ పడ్డారు. ఐపీఎల్​లో పాండ్య ప్రస్తుతం ముంబై ఇండియన్స్​ జట్టులో ఉన్నాడు. అయితే అతడి కోసం చెన్నై సూపర్​ కింగ్స్​ ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం. దీనిపై త్వరలో క్లారిటీ రానుంది.

 

దీనిని కూడా చదవండి : Srisailam Reservoir | శ్రీశైలం జలాశయానికి భారీగా వరద

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *