Ekana Stadium Fight | ఏకనా స్టేడియంలో రచ్చ.. చెప్పులతో కొట్టుకున్న అభిమానులు!

Naresh Chandan
Ekana Stadium Fight

అక్షరటుడే, వెబ్​డెస్క్: Ekana Stadium Fight | లక్నోలోని Ekana Cricket Stadiumలో Indian Premier League మ్యాచ్ సందర్భంగా ప్రేక్షకుల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. Lucknow Super Giants – Rajasthan Royals జట్ల మధ్య పోరు జరుగుతుండగా, స్టాండ్స్‌లో ఉన్న అభిమానులు ఒక్కసారిగా గొడవకు దిగారు.

Ekana Stadium Fight | తీవ్ర హంగామా

ఒకరినొకరు తోసుకుంటూ, చెప్పులతో కొట్టుకుంటూ తీవ్ర హంగామా సృష్టించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. గొడవకు కారణమైన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు.

ఈ ఘటనతో స్టేడియంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొనగా, తర్వాత మ్యాచ్ యథావిధిగా కొనసాగింది. అధికారులు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడతామని వెల్లడించారు.

దీనిని కూడా చదవండి : Supreme Court | జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చినా ఓకే.. కానీ వాట్సాప్ యూనివర్సిటీ నుంచి వద్దు: సుప్రీం జడ్జి

Follow:
గత 20 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నారు. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టారు. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశారు. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా తన ప్రయాణం మొదలెట్టారు. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నారు. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *