అక్షరటుడే, వెబ్డెస్క్: SI Minor Driving | ఆరేళ్ల బాలికతో కారు డ్రైవింగ్ చేయించిన ఎస్సైపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆయనపై కఠిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం అవుతున్నారు.హైదరాబాద్ (Hyderabad) నగరంలోని నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలోని గంధంగూడ-బైరాగిగూడ రోడ్డుపై ఎస్సై పూజారి తిరుపతి తన మనవరాలికి కారు స్టీరింగ్ ఇచ్చాడు.
ఆరేళ్ల బాలిక కారు నడుపుతుండటంతో.. ప్రధాన రోడ్డుపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో స్థానికులు ఆయనను ప్రశ్నించారు. అయితే తాను ఎస్సైని అని ఆయన దబాయించారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో సైబరాబాద్ పోలీసులు (Cyberabad Police) చర్యలు చేపట్టారు.
SI Minor Driving | డీజీపీ ఆదేశాలు

ఎస్సై తిరుపతి తీరుపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు అయితే ఏం అయినా చేయొచ్చా అని ప్రశ్నించారు. సామాన్య ప్రజలు మైనర్లకు వాహనాలు ఇస్తే కేసులు నమోదు చేసే పోలీసులు.. ఎస్సైపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ విషయం డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) వరకు వెళ్లింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ అనాలోచిత చర్యకు సంబంధించి, సదరు అధికారిని సస్పెండ్ చేయాలని, శాఖాపరమైన విచారణను ప్రారంభించాలని డీజీపీ ఆదేశించారు.
ఇది కూడా చదవండి..: Kothwalguda Eco Park | కాంక్రీట్ నగరానికి కాస్త దూరంలో..ప్రకృతి ఒడిలో వీకెండ్ సందడి..కొత్త్వాల్‌గూడ ఎకో పార్క్ ప్రత్యేక ఆకర్షణ