అక్షరటుడే, వెబ్డెస్క్ : Telangana Rain Forecast | రాష్ట్రంలో వర్షాలు లేక ఆందోళన చెందుతున్న రైతులకు వాతావరణ శాఖ గుడ్న్యూస్ చెప్పింది. ఈ నెల 16 నుంచి అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురస్తాయని పేర్కొంది.
రాష్ట్రంలో ఎండలు మండుతున్నాయి. నాలుగు రోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరిగాయి. దీంతో ఉక్కపోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. సోమవారం కూడా రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం పొడిగా ఉంటుంది. ఎండల తీవ్రత అధికంగా ఉంటుంది. తూర్పు తెలంగాణ (Telangana) జిల్లాల్లో 38-40 డిగ్రీలు, మిగతా ప్రాంతాల్లో 36-39 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉంది. ఈ నెల 15 వరకు ఎండల తీవ్రత కొనసాగనుంది.
Telangana Rain Forecast | తేలికపాటి వర్షాలు
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో జులై 16 నుంచి 19 వరకు అక్కడక్కడ వర్షాలు కురుస్తాయి. అయితే ఇవి రాష్ట్రవ్యాప్తంగా ఉండవు. ఈ వర్షాలతో గాలిలో తేమ ఎక్కువై ఉక్కపోత ఉంటుంది. అనంతరం ఈ నెల 20 తర్వాత విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
Telangana Rain Forecast | సాగని సాగు

రాష్ట్రంలో వర్షాలు లేకపోవడంతో వ్యవసాయ పనులు సాగడం లేదు. వానాకాలం ప్రారంభమై 40 రోజులు దాటుతున్న చెప్పుకోదగ్గ వానలు లేవు. దీంతో పంటలు వేయడానికి రైతులు ఆలోచిస్తున్నారు. చెరువులు, ప్రాజెక్టుల్లో నీరు లేకపోవడంతో ఆయకట్టు కింద వరినాట్లు వేయడం లేదు. బోరుబావుల ఆధారంగా పలువురు రైతులు వరి నాట్లు, ఇతర పంటలు సాగు చేస్తున్నారు. అయితే పంటలకు నీరు అందడం లేదు. మరోవైపు భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. దీంతో బోరుబావులు ఎత్తిపోతున్నాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. అన్నదాతలు నిత్యం ఆశగా ఆకాశం వైపు చూస్తున్నారు. అయితే వరుణుడు మాత్రం కరుణించడం లేదు.
ఇది కూడా చదవండి..: SI Minor Driving | మనవరాలికి కారు స్టీరింగ్ ఇచ్చిన ఎస్సైపై కేసు