KTR Uttam Kumar Reddy | ఈ మధ్యకాలంలో నేను విన్న బెస్ట్ జోక్ ఇదే’.. మంత్రి ఉత్తమ్ వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు..

హైదరాబాద్ నగరంలో తాగునీటి కొరత లేదని, వచ్చే వర్షాకాలం వరకు రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనపై , కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

Shivam nagarani

అక్షరటుడే, వెబ్​డెస్క్: KTR Uttam Kumar Reddy | హైదరాబాద్ (Hyderabad) నగరంలో తాగునీటి కొరత లేదని, వచ్చే వర్షాకాలం వరకు రిజర్వాయర్లలో సరిపడా నీటి నిల్వలు ఉన్నాయని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చేసిన ప్రకటనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మంత్రి వ్యాఖ్యలపై ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మధ్యకాలంలో తాను విన్న అత్యుత్తమ జోక్ ఇదేనంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.

KTR Uttam Kumar Reddy | కేటీఆర్ ఆరోపణ..

“కాంగ్రెస్ జోకర్లను ఎన్నుకుంటే ఇలాంటి సర్కస్‌నే ఆశించాలి మరి” అంటూ కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. క్షేత్రస్థాయిలో తాగునీటి పరిస్థితులు మంత్రి చెబుతున్న దానికి పూర్తిగా భిన్నంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఇబ్బందులను పట్టించుకోకుండా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వాస్తవాలకు దూరంగా ప్రకటనలు చేస్తున్నారని కేటీఆర్ తన ట్వీట్‌లో విమర్శించారు.

ఇది కూడా చదవండి..: Akvan Cyclone Telangana | తెలంగాణకు ‘అక్వాన్’ తుపాను ముప్పు.. ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *