అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Kaleshwaram Motors |కాళేశ్వరం మోటార్లు వెంటనే ఆన్‌చేయాలని మాజీ మంత్రి హరీశ్‌రావు (Harish Rao) డిమాండ్ చేశారు. రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయలకు అతీతంగా వెంటనే నీటి పంపింగ్ చేయాలన్నారు. ఈ మేరకు మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి లేఖ రాశారు.
కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలో వివిధ జిల్లాలోని రిజర్వాయర్లు అన్నపూర్ణ, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండ పోచమ్మ సాగర్, బస్వాపూర్ రిజర్వాయర్ లను నింపాలని హరీశ్‌రావు కోరారు. సుమారు 4 లక్షల ఎకరాల ఆయకట్టు పరిధిలోని రైతుల ప్రయోజనాల దృష్ట్యా కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా మిడ్ మానేరు నుండి మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ చేయాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షాభావం, అటు ప్రాజెక్టుల్లో నీటిని సకాలంలో నింపక పోవడంతో పంటల సాగు ముందుకు సాగక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు.
Kaleshwaram Motors |ఆయకట్టుకు నీరు అందించాలి
కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన మిడ్ మానేరు రిజర్వాయర్ పూర్తి నీటి సామర్థ్యం 27 టీఎంసీలు కాగా ప్రస్తుతం 22 టీఎంసీల నీరు ఉందన్నారు. మిడ్ మానేరు నుండి మోటార్లను ఆన్ చేసి నీటి పంపింగ్ ప్రారంభించాలని, తద్వారా కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్భాగమైన అన్నపూర్ణ (అంతగిరి), రంగనాయక సాగర్, మల్లన్న సాగర్,కొండపోచమ్మ సాగర్, నృసింహ (బస్వాపూర్ ) తదితర రిజర్వాయర్ లను, వాటి పరిధిలోని చెరువులను, చెక్ డ్యామ్ ల అన్నింటిని నింపాలన్నారు. మిడ్‌మానేరు నుంచి లోయర్ మానేరు డ్యాంను సైతం నింపాలని కోరారు.
దీనిని కూడా చదవండి : Punjab Gangsters Encounter | పంజాబ్‌లో ఎన్కౌంటర్.. ఇద్దరు గ్యాంగ్స్టర్లకు గాయాలు