KTR Comments Revanth | రేవంత్​రెడ్డిని ఎవరు దేకడం లేదు.. కేటీఆర్​ సంచలన వ్యాఖ్యలు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : KTR Comments Revanth | ముఖ్యమంత్రి రేవంత్​రెడ్డి (CM Revanth Reddy)ని ఎవరు దేకడం లేదని బీఆర్​ఎస్ (BRS)​ వర్కింగ్​ ప్రెసిడెంట్ కేటీఆర్​ ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన హుజుర్​నగర్​లో పర్యటించారు. హుజూర్‌నగర్ నియోజకవర్గ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నాయకుడు పిల్లుట్ల రఘుతో పాటు పలువురు బీఆర్​ఎస్​లో చేరారు.

కేటీఆర్​ మాట్లాడుతూ.. ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో యాంకర్​ మాట్లాడుతూ.. శ్రీధర్​బాబును ముఖ్యమంత్రి అన్నారని ఎద్దేవాచేశారు. రేవంత్​రెడ్డిని ఎవరు గుర్తు పట్టడం లేదని విమర్శించారు. BRS హయాంలో తెచ్చిన కంపెనీలకు.. ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారని పేర్కొన్నారు. సీఎంగా రేవంత్ పేరుగుర్తు పెట్టుకునే పరిస్థితి లేదన్నారు.

KTR Comments Revanth | బీఆర్​ఎస్​ బలం పెరిగింది

పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ బలం పెరిగిందని కేటీఆర్​ అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ ఇంట్లో మొదలైన బీఆర్ఎస్ ప్రయాణం 25 ఏళ్లు పూర్తి చేసుకుందన్నారు. ‘‘మూడు ఫీట్లు ఉన్నోడు కూడా కేసీఆర్ గారి మీద మాట్లాడుతున్నాడు”అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. చిన్న తప్పిదాలతో నల్గొండ (Nalgonda) జిల్లాలో 11 సీట్లు కోల్పోయామని ఆయన అంగీకరించారు.

brs 1

KTR Comments Revanth | హామీలు విస్మరించారు

తాము అధికారంలోకి వస్తే వంద రోజుల్లో అమలు చేస్తామని కాంగ్రెస్​ నాయకులు హామీలు ఇచ్చారని.. వెయ్యి రోజులైనా ఏమీ చేయలేదన్నారు. నల్గొండకు కాంగ్రెస్ చేసిందేమీ లేదని విమర్శించారు. కనీసం నీళ్లు ఇవ్వలేకపోయిందన్నారు. కేసీఆర్ పాలనలో నల్గొండలోని చివరి మడివరకు నీళ్లు పారేలా కృషి చేశారని చెప్పారు. బీఆర్​ఎస్​ హయాంలో 70 లక్షల మంది రైతులకు కరోనా లాంటి క్లిష్ట సమయాల్లో కూడా రైతుబంధు అందించారన్నారు. రేవంత్ ఎన్నికల ముందు దాన వీర శూర కర్ణ అని.. ఎన్నికలు అయ్యాక కుంభ కర్ణుడని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్​ఎస్​ అధికారంలోకి వస్తుందన్నారు.

ఇది కూడా చదవండి : Teacher Transfers | విద్యాశాఖలో బదిలీలకు గ్రీన్​ సిగ్నల్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *