Konda Surekha | వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరు.. పీసీసీ చీఫ్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు

ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Konda Surekha | ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ రాజకీయాల్లో మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరి మధ్య ఆధిపత్య పోరు తీవ్రస్థాయికి చేరింది. ఈ వివాదం ఇప్పుడు రాష్ట్ర పార్టీ కార్యాలయానికి చేరడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న కొండా సురేఖకు తెలియకుండానే, ఆమె శాఖకు సంబంధించిన విషయాలపై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఏకపక్షంగా సమీక్షా సమావేశాలు నిర్వహించడంపై మంత్రి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇది ప్రోటోకాల్ నిబంధనలను ఉల్లంఘించడమేనని ఆమె ఆరోపిస్తున్నారు.

Konda Surekha | పీసీసీ చీఫ్‌కు ఫిర్యాదు..

ఈ అంశంపై మంత్రి కొండా సురేఖ గురువారం ఉదయం పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్‌ను కలిశారు. కడియం శ్రీహరి తీరుపై తన తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ, ఆయనపై వెంటనే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ గొడవపై తాను ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు ఆమె వెల్లడించారు.

Konda Surekha | స్పందించిన పీసీసీ చీఫ్..

మంత్రి ఫిర్యాదుపై మహేశ్ కుమార్ గౌడ్ సానుకూలంగా స్పందించారు. వరంగల్ జిల్లా రాజకీయ పరిణామాలపై తాము నిరంతరం నిఘా ఉంచామని, గ్రూపు రాజకీయాల వల్ల పార్టీ ప్రతిష్టకు నష్టం వాటిల్లితే ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. త్వరలోనే మంత్రి కొండా సురేఖ, ఎమ్మెల్యే కడియం శ్రీహరితో విడివిడిగా మాట్లాడి, ఈ వివాదానికి ముగింపు పలుకుతామని ఆయన హామీ ఇచ్చారు.

ఇది కూడా చదవండి:  India Australia Nuclear Deal | అణుశక్తి ఒప్పందంపై సంతకం చేసిన భారత్​, ఆస్ట్రేలియా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *