అక్షరటుడే, నిజామాబాద్ అర్బన్: Handloom Society Elections | నిజామాబాద్ (Nizamabad) చేనేత సహకార సంఘం పాలక మండలి ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ విడుదలైంది. రాష్ట్ర సహకార ఎన్నికల అథారిటీ(State Cooperative Election Authority) ఉత్తర్వుల ప్రకారం.. ఎన్నికల నిర్వహణ కోసం ఎన్నికల అధికారిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి.
Handloom Society Elections | 9మంది కార్యవర్గ సభ్యులకు..
పాలక మండలిలో 9 మంది కార్యవర్గ సభ్యుల ఎన్నిక కోసం ప్రక్రియ జరగనుంది. ఇందులో 7 జనరల్ స్థానాలు కాగా, 2 మహిళా స్థానాలుగా కేటాయించారు. సంఘ భవనంలో ఈ ఎన్నికల కార్యక్రమం నిర్వహించనున్నారు. జూలై 13, 14 మరియు 15 తేదీలలో మధ్యాహ్నం 1.30 వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. కార్యవర్గ సభ్యుల పోటీకి రూ.500 ఉంటుందని అధికారులు తెలిపారు. ఇతర కేటగిరీల ఆధారంగా: రూ. 500, రూ. 750, రూ.1,000గా నిర్ణయించారు. జూలై 16న ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు నామినేషన్ల పరిశీలన జరుగుతుంది.
Handloom Society Elections | జూలై 21న పోలింగ్..
అలాగే జూలై17న నామినేషన్ల ఉపసంహరణ జరుగనుంది. అనంతరం అదే రోజు మధ్యాహ్నం 1:30 గంటల తర్వాత పోటీలో నిలిచే అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు. జూలై 21న ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 2 వరకు పోలింగ్ జరుగుతుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఓట్ల లెక్కింపు చేపట్టి, ఫలితాలను ప్రకటిస్తారు. ఈ ఎన్నికల ప్రక్రియ అంతా నిజామాబాద్‌లోని చేనేత సహకార సంఘ భవనంలోనే నిర్వహించబడుతుందని ఎన్నికల అధికారి ఒక ప్రకటనలో తెలిపారు.
ఇది కూడా చదవండి: | ప్రేమ వివాహం చేసుకున్నాడని..