అక్షరటుడే వెబ్‌డెస్క్: Awiqli Insulin | మధుమేహం (డయాబెటిస్) బాధితులకు ఊరటనిచ్చే వార్త. రోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్లు తీసుకోవాల్సిన బాధ నుంచి రోగులకు విముక్తి కల్పిస్తూ, ప్రముఖ ఫార్మా సంస్థ ‘నోవో నార్డిస్క్’ ( Novo Nordisk )వినూత్నమైన మందును భారత్‌లో విడుదల చేసింది. ‘Awiqli’ (ఇన్సులిన్ ఐకోడెక్) పేరుతో ప్రవేశపెట్టిన ఈ ఇన్సులిన్, వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది.
Awiqli Insulin | సంవత్సరానికి 52 ఇంజెక్షన్లకే..
సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుకోవడానికి ప్రతిరోజూ ఇన్సులిన్ ఇంజెక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల సంవత్సరానికి దాదాపు 365 సార్లు ఇంజెక్షన్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉండేది. కానీ, ఇప్పుడు అందుబాటులోకి వచ్చిన ‘Awiqli’తో రోగులు వారానికి ఒకే ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోతుంది. అంటే, సంవత్సరానికి ఇంజెక్షన్ల సంఖ్య కేవలం 52కి పడిపోనుంది. ఇది రోగులకు శారీరక ఇబ్బందులను తగ్గించడమే కాకుండా, మానసిక ఉపశమనాన్ని కూడా ఇస్తుందని వైద్య నిపుణులు అభిప్రాయపడుతున్నారు. టైప్-1, టైప్-2 డయాబెటిస్ ఉన్న వారికి ఇది ఎంతో మేలు చేస్తుందని సంస్థ పేర్కొంది.
Awiqli Insulin | అందరికీ అందుబాటులో ఉండేలా..
భారతదేశంలో మధుమేహ బాధితుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో, ఈ మందు ధరను కూడా అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయించారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న రోజువారీ బేసల్ ఇన్సులిన్ ధరలతో పోలిస్తే, యూనిట్‌కు రూ.3.5 పైసల చొప్పున ధరను నిర్ణయించినట్లు సమాచారం. దీనివల్ల చికిత్స ఖర్చు దాదాపు 20 నుంచి 25 శాతం వరకు తగ్గే అవకాశం ఉంది. గ్లోబల్ క్లినికల్ ట్రయల్స్‌లో కూడా ఈ కొత్త ఇన్సులిన్ పాత పద్ధతుల కంటే మెరుగ్గా పనిచేస్తున్నట్లు వెల్లడైంది. రోజువారీ సూదుల బాధ నుంచి డయాబెటిస్ బాధితులకు ఈ ‘Awiqli’ ఓ వరంలా మారనుంది.
ఇది కూడా చదవండి: Konda Surekha | వరంగల్ కాంగ్రెస్‌లో వర్గపోరు.. పీసీసీ చీఫ్‌కు మంత్రి కొండా సురేఖ ఫిర్యాదు