NHM Employees | ’ఎన్​హెచ్​ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేయాలి’

ఎన్​హెచ్​ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేయాలని తెలంగాణ ఆయుష్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యావనంది పురుషోత్తం పటేల్ డిమాండ్​ చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: NHM Employees | ఎన్​హెచ్​ఎం ఉద్యోగులను రెగ్యులరైజ్​ చేయాలని తెలంగాణ (Telangana) ఆయుష్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు న్యావనంది పురుషోత్తం పటేల్ డిమాండ్​ చేశారు. నిజామాబాద్​ నగరంలోని (Nizamabad) ధర్నాచౌక్​లో ధర్నా చేస్తున్న ఎన్​హెచ్​ఎం ఉద్యోగులకు ఆయన మద్దతు తెలిపారు.

NHM Employees | సంపూర్ణ మద్దతు తెలుపుతున్నాం..

ఈ సందర్భంగా న్యావనంది పురుషోత్తం పటేల్​ మాట్లాడుతూ.. ఎన్​హెచ్ఎం ఉద్యోగుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలని డిమాండ్​ చేశారు. ఉద్యోగుల సమస్యల పరిష్కరించేంత వరకు తాము వారికి అండగా నిలుస్తామని స్పష్టం చేశారు.

ఐఎన్​టీయూసీ కాంగ్రెస్​ నాయకులు సోమవారం ఉద్యోగులకు మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్యులు జ్యోత్స్న, అర్వింద్​, జయరాజ్, బాబురావు, నటరాజ్, కంచెట్టి రవి, నాయకులు సురేందర్, భిక్షపతి, రమణ, శైలజ, హన్మాండ్లు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: దసరా రోజు పాలపిట్టను ఎందుకు చూడాలి? 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *