అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Future City Commissionerate | ఇబ్రహీంపట్నం (Ibrahimpatnam)లో నూతనంగా ఏర్పాటు చేసిన ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనరేట్‌ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సోమవారం సాయంత్రం ప్రారంభించారు. అనంతరం పోలీస్ కమిషనర్ తరుణ్ జోషీ కార్యాలయాన్ని ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఫ్యూచర్ సిటీ నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో కొత్తగా కమిషనరేట్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా కమిషనరేట్‌ను తాజాగా సీఎం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీలు వేం నరేందర్ రెడ్డి, మల్లు రవి, చామల కిరణ్ కుమార్ రెడ్డి, శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి, శాసనసభ్యులు మల్‌రెడ్డి రంగారెడ్డి, డీజీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.
దీనిని కూడా చదవండి : Ganja Smuggling | గంజాయి రవాణాపై పోలీసుల ఉక్కుపాదం.. ఇద్దరి అరెస్ట్