Nizamabad CI Transfers | నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో సీఐల బదిలీలు

నిజామాబాద్​ కమిషనరేట్​ పరిధిలో సీఐల బదిలీలు జరిగాయి.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ క్రైం: Nizamabad CI Transfers | నిజామాబాద్​ కమిషనరేట్ (Nizamabad Police)​ పరిధిలో సీఐల బదిలీలు జరిగాయి. ఈ మేరకు మల్టీజోన్​–1 ఐజీ చంద్రశేఖర్​ రెడ్డి గురువారం ఉత్తర్వులు జారీ చేశారు.

Nizamabad CI Transfers | కమిషనరేట్​ పరిధిలో..

గణపతి శ్రీనివాస్​రాజ్​ను సీఎస్​బీకి ట్రాన్స్​ఫర్​ చేశారు. అలాగే ఆర్మూర్​ పోలీస్​స్టేషన్​లో ఉన్న సత్యనారాయణ టౌన్​సీఐగా నియమితులయ్యారు. నిజామాబాద్​ నార్త్​ రూరల్​ సర్కిల్​ నుంచి శ్రీనివాస్​ను 1వ టౌన్​ పీఎస్​కు ఎస్​హెచ్​వోగా ట్రాన్స్​ఫర్​చేశారు. అక్కడ పనిచేస్తున్న రఘుపతిని ఐజీ కార్యాలయంలో రిపోర్ట్​ చేయాలని ఆదేశాలు అందాయి. సౌత్​ రూరల్ సర్కిల్​ నుంచి నిరూడి సురేష్​కమార్​ను పీసీఆర్​కు ట్రాన్స్​ఫర్​ చేశారు. ఆయన స్థానంలో ధర్పల్లిలో ఉన్న భిక్షపతిని నియమించారు. ధర్పల్లి సర్కిల్​కు పీసీఆర్​లో ఉన్న రామన్​ను ట్రాన్స్​ఫర్​ చేశారు.

Nizamabad CI Transfers | ట్రాఫిక్​ సీఐ ప్రసాద్​ మహిళా పోలీస్​స్టేషన్​కు..

ట్రాఫిక్​ పోలీస్​స్టేషన్​ ఇన్​స్పెక్టర్​ ప్రసాద్​ మహిళా పోలీస్​స్టేషన్​ ఎస్​హెచ్​వోగా నియమితులయ్యారు. ఉమెన్​ పోలీస్​స్టేషన్​ సీఐ శ్రీలతను హైదరాబాద్​ ఐజీ కార్యాలయంలో రిపోర్ట్​ చేయాలని ఆదేశించారు. అలాగే వీఆర్​లో ఉన్న శ్రీనివాస్​ను నార్త్​ రూరల్​ సర్కిల్​లో నియమించారు. సీఎస్​బీలో ఉన్న శ్రీధర్​ రెడ్డిని నిజామాబాద్​ రూరల్​ పీఎస్​కు బదిలీ చేశారు. గణపతి శ్రీనివాస్​రాజ్​ సీఎస్​బీలో నియమితులయ్యారు. అలాగే ఆర్మూర్​ పీఎస్​ ఎస్​హెచ్​వోగా హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ వాటర్​ సప్లై అండ్​ సీవరేజ్​ బోర్డు ఓడీ శ్రీకాంత్​గౌడ్​ ట్రాన్స్​ఫర్​ అయ్యారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని ఐజీ ఆదేశాలు పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి: ఇండియాలో తగ్గుతున్న జననాలు.. మరో సంక్షోభం తప్పదా? 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *