అక్షరటుడే, వెబ్డెస్క్: Dundigal Crime News | హైదరాబాద్ Hyderabad మహా నగరంలోని దుండిగల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అత్యంత హేయమైన, దారుణమైన ఘటన వెలుగు చూసింది.
ఒంటరిగా ఉన్న ఓ యువతిపై కామాంధుడు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. బలవంతంగా గదిలోకి లాకెళ్లి, కాళ్లు, చేతులు కట్టేసి అరాచకానికి తెగబడిన ఈ దారుణ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Dundigal Crime News | నిందితుడి పైశాచికం..
పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దుండిగల్ పీఎస్ పరిధిలో ఓ యువతిపై నిందితుడు పశువులా ప్రవర్తించాడు. యువతిని బలవంతంగా గదిలోకి లాకెళ్లిన నిందితుడు, ఆమె తప్పించుకోకుండా కాళ్లు, చేతులు కట్టేసి దారుణంగా లైంగిక దాడికి పాల్పడ్డాడు.
ఈ రాక్షసత్వాన్ని యువతి తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఆగ్రహానికి గురైన నిందితుడు పగిలిన బాటిల్‌తో ఆమెను పొడిచి చంపేస్తానని తీవ్రంగా బెదిరిస్తూ భయభ్రాంతులకు గురిచేశాడు.
Dundigal Crime News | స్థానికుల దేహదారుఢ్యం
యువతి ఆర్తనాదాలు, ఆ గదిలో జరుగుతున్న ఘోరాన్ని గమనించిన యువతి మేనత్త గట్టిగా కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు అప్రమత్తమై అక్కడికి చేరుకున్నారు.
ఇది గమనించిన నిందితుడు అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించాడు. అయితే అప్రమత్తమైన స్థానికులు సాహసించి ఆ నీచుడిని వెంబడించి పట్టుకున్నారు. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు.
Akshara Today | ప్రజల గొంతుకగా అక్షరటుడే.. డిజిటల్ దిశగా మరో అడుగు..
ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయగా.. పోలీసులు వెంటనే రంగంలోకి దిగి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మహిళలు, యువతుల భద్రతకు భంగం కలిించేలా ప్రవర్తించిన ఈ అరాచక నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.