Sirpur Silk Workers | సర్​ సిల్క్​ సంస్థ కార్మికులకు న్యాయం చేయాలి : కవిత

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Sirpur Silk Workers | కాగజ్​ నగర్​లోని సర్ సిల్క్ సంస్థ కార్మికులు క్వార్టర్స్ ఖాళీ చేసేది లేదని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. 25 ఏళ్లుగా అక్కడే ఉంటున్న వాళ్లను వారం రోజుల్లో ఖాళీ చేయమంటే ఎలా అని ప్రశ్నించారు.

కవిత మాట్లాడుతూ.. కాగజ్ నగర్ నియోజకవర్గం ఒకప్పుడు పరిశ్రమలకు పెట్టింది పేరన్నారు. సర్ సిల్క్ సంస్థ మూతపడిన తర్వాత కార్మికులకు రావాల్సిన చాలా బకాయిలు ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయన్నారు. కంపెనీ మూతపడిన సరే కంపెనీకి చెందిన క్వార్టర్స్ లోనే 5 వేల మంది కార్మికులు ఉంటున్నారని చెప్పారు. 25 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న వారిని ఇప్పుడు వారం రోజుల్లో ఖాళీ చేయాలని నోటీసులు ఇచ్చారన్నారు.

Sirpur Silk Workers | ప్రైవేట్ వ్యక్తులకు అమ్మి..

సర్ సిల్క్ సంస్థ (Sirpur Silk Workers) స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసి ఇప్పుడు కార్మికులను క్వార్టర్స్ ఖాళీ చేయాలని అంటున్నారని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. నోటీసులు వచ్చిన వాళ్లలో ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ కూడా ఉన్నారన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సంస్థకు చెందిన స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్మేసి కార్మికుల ఇళ్లను ఖాళీ చేయాలని అంటున్నారన్నారు. బకాయిలు పెండింగ్ లో ఉన్న సరే కార్మికులు అక్కడే ఉన్నారని, ఇప్పుడు ఖాళీ చేయాలని అంటే 5 వేల మంది కార్మికుల పరిస్థితి ఏమవుతుందని ప్రశ్నించారు.

దీనిని కూడా చదవండి : Lakdikapul One Way | లక్డీకాపూల్‌లో వన్‌-వే అమలుకు కసరత్తు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *