తెలంగాణTransfers | రాష్ట్రంలో అదనపు కలెక్టర్లు, ఆర్డీవోల బదిలీ

Transfers | రాష్ట్రంలో అదనపు కలెక్టర్లు, ఆర్డీవోల బదిలీ

రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు అదనపు కలెక్టర్లను బదిలీ చేసింది. మొత్తం 27 మందిని ట్రాన్స్​ఫర్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Transfers | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. పలువురు అదనపు కలెక్టర్లను బదిలీ చేసింది. మొత్తం 27 మందిని ట్రాన్స్​ఫర్​ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. బదిలీ అయిన వారిలో అదనపు కలెక్టర్లు, స్పెషల్​ గ్రేడ్​ డిప్యూటీ కలెక్టర్లు ఉన్నారు.

Transfers | బదిలీ అయిన అధికారులు వీరే..

వెయిటింగ్​లో ఉన్న బి.హరిసింగ్​ను సూర్యపేట అదనపు కలెక్టర్​గా బదిలీ చేశారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్​ ఆర్​డీ మాధురిని నల్గొండ స్పెషల్​ కలెక్టర్​గా నియమించారు. హెచ్​ఎండీఏలో డిప్యూటేషన్​పై పనిచేస్తున్న అదనపు కలెక్టర్​ డి.రాజ్యలక్ష్మిని పెద్దపల్లి అదనపు కలెక్టర్​గా పంపించారు. కామారెడ్డి డీఆర్​వో సీహెచ్​.మధుమోహన్​ను గద్వాల్​ అదనపు కలెక్టర్​గా బదిలీ చేశారు. రంగారెడ్డి డీఆర్​వో టీఎల్​.సంగీతను సంగారెడ్డి అదనపు కలెక్టర్​గా నియమించారు. వెయిటింగ్​లో ఉన్న వి.హనుమానాయక్​ను వరంగల్​ స్పెషల్​ కలెక్టర్​గా పంపించారు. హైదరాబాద్​ ఎస్​డీసీలో ఉన్న ఎం.సుర్యప్రకాశ్​ను వనపర్తి డీఆర్​వోగా ట్రాన్స్​పర్​ చేశారు. సిరిసల్ల ఆర్డీవో సీహెచ్​.వెంకటేశ్వర్లును జనగామ డీఆర్​వోగా బదిలీ చేశారు.

Transfers | మహబూబాబాద్​ డీఆర్​వోగా..

వెయిటింగ్​లో ఉన్న బి.వసంత కుమారిని భూపాలపల్లి డీఆర్​వోగా నియమించారు. హైదరాబాద్​ ఎస్​ఏటీజీలో పనిచేస్తున్న​ ఎస్​.పద్మావతిని భద్రాద్రి కొత్తగూడెం డీఆర్​వోగా పంపించారు. జీహెచ్​ఎంసీలో పనిచేస్తున్న వి.రమాదేవిని సిరిసల్ల డీఆర్​వోగా బదిలీ చేశారు. మైనారిటీ వెల్ఫేర్​ డిపార్ట్​మెంట్​లో పనిచేస్తున్న జుబేద్​ ఉన్నీసాబేగంను మహబూబాబాద్​ డీఆర్​వోగా ట్రాన్స్​ఫర్​ చేశారు. పెద్దపల్లి అదనపు కలెక్టర్​ డి.వేణును ఆసిఫాబాద్​ డీఆర్వోగా నియమించారు. వెయిటింగ్​లో ఉన్న బి.స్రవంతిని ఆదిలాబాద్​ డీఆర్​వోగా పంపించారు. మైనారిటీ వెల్ఫేర్​లో పనిచేస్తున్న ఎస్​.రాజేశ్వరిని నారాయణపేట డీఆర్​వో బదిలీ చేశారు. హౌసింగ్​ డిపార్ట్​మెంట్​లో ఉన్న కె.శ్రీనివాస్​ను హన్మకొండ డీఆర్​వోగా బదిలీ చేశారు. మహబూబ్​నగర్​ స్పెషల్​ కలెక్టర్​గా ఉన్న ఎల్​.రమేశ్​ను నారాయణపేట ఆర్డీవోగా ట్రాన్స్​ఫర్​ చేశారు.

‘కుడా’లో డిప్యూటేషన్​పై పనిచేస్తున్న రవీందర్​ రెడ్డిని బాన్సువాడ ఆర్డీవోగా నియమించారు. టీజీఎస్​డబ్ల్యూఆర్​ఈఐలో పనిచేస్తున్న బి.గీతను నిజామాబాద్​ డీఆర్​వోగా పంపించారు. సివిల్స్​ సప్లయ్స్​లో పనిచేస్తున్న జి.అంబాదాస్​ను మెదక్​ డీఆర్​వోగా ట్రాన్స్​ఫర్​ చేశారు. డిప్యూటేషన్​పై హెచ్​ఎండీలో పనిచేస్తున్న ఎం.షర్మిలను ఉట్నూరు ఆర్డీవోగా బదిలీ చేశారు. హైదరాబాద్​ మెట్రోపాలిటన్​ వాటర్​ సప్లయ్స్​లో పనిచేస్తున్న ఎం.విజయ కుమారి బోధన్​ ఆర్డీవోగా నియమితులయ్యారు. దేవరకొండ ఆర్డీవో ఎస్​.రమణారెడ్డిని మిర్యాలగూడ ఆర్డీవోగా పంపించారు. ‘రెరా’లో పనిచేస్తున్న దొనకంటి రవీందర్​ను కాటారం ఆర్డీవోగా ట్రాన్స్​ఫర్​ చేశారు. టీటీడబ్యలూఆర్​ఈఐఎస్​లో ఉన్న ఎన్​.రాజేందర్​ రెడ్డిని సిరిసల్ల ఆర్డీవోగా పంపించారు. వేర్​ హౌసింగ్​ కార్పొరేషన్​లో పనిచేస్తున్న కే.ఎస్.బీ.కుమారిని వేములవాడ ఆర్డీవోగా నియమించారు. హెచ్​ఎండీఏలో డిప్యూటేషన్​పై పనిచేస్తున్న పి.పద్మప్రియను దేవరకొండ ఆర్డీవోగా బదిలీ చేశారు.

ఇది కూడా చదవండి..: Weather Update | వాతావరణ శాఖ చల్లని కబురు.. తెలంగాణకు వర్ష సూచన

Srinivas Kolluri
Srinivas Kollurihttps://aksharatodaynews.com/
తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Hajj Subsidy Telangana| హజ్ యాత్రికులకు తెలంగాణ సర్కార్ ఊరట.. అదనపు భారం భరించనున్న ప్రభుత్వం!

అక్షరటుడే వెబ్‌డెస్క్:Hajj Subsidy Telangana| పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో...

Nizamabad DRO Appointments | ఉమ్మడి నిజామాబాద్​ జిల్లాకు డీఆర్​వో, ఆర్డీవోల నియామకం

అక్షరటుడే, కామారెడ్డి: Nizamabad DRO Appointments |  రాష్ట్రంలో పలువురు అదనపు...

West Bengal Politics| బెంగాల్‌లో కమల వికాసం.. మే 9న నూతన ప్రభుత్వ అడుగులు!

అక్షరటుడు వెబ్‌డెస్క్:West Bengal Politics|పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కొత్త శకం ఆరంభం...

BJP Victory Celebration | ఎల్లారెడ్డిలో బీజేపీ విజయోత్సవ సంబరాలు

అక్షరటుడే, ఎల్లారెడ్డి: BJP Victory Celebration | వెస్ట్ బెంగాల్, అస్సాం,...