MLA Prakash Goud | కొడుకుపై దాడి చేయించిన ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్​!

రాజేంద్రనగర్ ఎమ్మెల్యేపై ఆయన కుమారుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి తనపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : MLA Prakash Goud | రాజేంద్రనగర్ ఎమ్మెల్యేపై ఆయన కుమారుడు సంచలన ఆరోపణలు చేశారు. తన తండ్రి తనపై దాడి చేయించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయనతో తనకు ప్రాణహాని ఉందని పేర్కొన్నారు.

ప్రకాశ్​గౌడ్​ బీఆర్​ఎస్ (BRS)​ నుంచి రాజేంద్ర నగర్​ ఎమ్మెల్యేగా గెలిచారు. అనంతరం కాంగ్రెస్ (Congress)​లో చేరారు. అయితే ఆయన కుమారుడు సంతోష్​ గౌడ్​ ఓ యువతిని ప్రేమించాడు. బీఆర్​ఎస్​ నాయకురాలు రూపారెడ్డి కుమార్తెను ప్రేమించి, నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. అయితే ఈ లవ్​ మ్యారేజ్​ ఎమ్మెల్యేకు ఇష్టం లేదని సమాచారం. దీంతో సంతోష్​ గౌడ్​ నెల రోజులుగా రూపారెడ్డి ఇంట్లోనే ఉంటున్నాడు. ఈ క్రమంలో 40 మంది ఆమె ఇంటిపై దాడి చేశారు.

prakash goud

MLA Prakash Goud | చంపడానికి యత్నం

ఎమ్మెల్యే కుమారుడు సంతోష్ గౌడ్​ మాట్లాడుతూ.. తన తండ్రి అనుచరులు తన కాబోయే భార్య ఇంటిపై దాడి చేసి, తమ ఇద్దరినీ చంపడానికి ప్రయత్నించారని పేర్కొన్నారు. “నా సొంత తండ్రి వల్లే నా ప్రాణాలకు ముప్పు ఉంది” అని ఆరోపించారు. ప్రేమించిన యువతిని వివాహం చేసుకోవడం తన తండ్రికి ఇష్టం లేదని.. ఈ నేపథ్యంలో దాడి చేయించి, చంపేందుకు ప్రయత్నిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ క్షణమైనా తనను చంపే ప్రమాదం ఉందని, తనకు, తనకు కాబోయే భార్య కుటుంబానికి రక్షణ కల్పించాలని పోలీసులను కోరారు.

MLA Prakash Goud | రక్షణ కల్పించాలి

రూపారెడ్డి సైతం ఈ విషయమై మాట్లాడుతూ.. తమకు పోలీసు రక్షణ కల్పించాలని కోరారు. ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కుమారుడితో తన కుమార్తె నిశ్చితార్థం జరిగిన తర్వాత, సుమారు 40 మంది వ్యక్తులను తమ నివాసానికి పంపించారని, ఇది తమ కుటుంబ భద్రతపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందన్నారు. ఈ విషయమై దర్యాప్తు జరపాలని కోరారు. ఈ క్లిష్ట సమయంలో బీఆర్ఎస్ నాయకత్వం తమ కుటుంబానికి అండగా నిలబడి, మద్దతును అందించాలని కోరారు. అయితే ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ తన కుమారుడితో తనకు ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు.

 

దీనిని కూడా చదవండి : Atiq Ahmed Son Death | గ్యాంగ్​స్టర్​ అతీక్​ అహ్మద్​ కుమారుడి మృతి

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *