అక్షరటుడే, వెబ్‌డెస్క్ : DGP Anand Comments | తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇక రాష్ట్రంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ లేదన్నారు. ప్రజలను గౌరవిస్తాం.. రౌడీలు, గుండాలను కాదని చెప్పారు.
డీజీపీ ఆనంద్ బుధవారం ఆదిలాబాద్ (Adilabad) జిల్లాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తోందన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో రోడ్డు ప్రమాదాలు, మరణాలు తగ్గాయన్నారు.
DGP Anand Comments | అందుకే ప్రమాదాలు..

జాతీయ రహదారి 44 (NH 44)పై ఎక్కువగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నట్లు డీజీపీ తెలిపారు. ఇందుకు అక్రమ పార్కింగ్‌లే కారణమని స్పష్టం చేశారు. వాహనదారులు ఎక్కడ పడితే అక్కడ తమ వాహనాలను ఆపోద్దని సూచించారు. సురక్షితంగా ప్రయాణించాలని సూచించారు. రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. 200 మందికి హెల్మెట్లు పంపిణీ చేశారు. ఆదిలాబాద్ జిల్లా పోలీసులు బాగా పని చేస్తున్నారని ప్రశంసించారు.
DGP Anand Comments | గ్రేహౌండ్స్‌ను తీసేస్తున్నాం
తెలంగాణలో మావోయిజం అంతమైందని డీజీపీ ప్రకటించారు. దీంతో గ్రేహౌండ్స్ విభాగాన్ని తీసేస్తున్నట్లు తెలిపారు. అందులో పని చేస్తున్న 1700 మందిని కొత్త విభాగాలకు బదిలీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా మావోయిస్టుల ఏరివేతే లక్ష్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రేహౌండ్స్ విభాగాన్ని ఏర్పాటు చేశారు.
DGP Anand Comments | గంజాయి నివారణకు చర్యలు
రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ నివారణకు చర్యలు చేపట్టినట్లు డీజీపీ తెలిపారు. గంజాయి ప్రస్తుతం గ్రామాల్లోకి కూడా వచ్చిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పంజాబ్‌లా రాష్ట్ర యువత డ్రగ్స్‌కు బానిసలు కావద్దన్నారు. భూపాలపల్లి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, ములుగు జిల్లాల్లో గంజాయి ఎక్కువగా సాగు చేస్తున్నట్లు గుర్తించామన్నారు. గంజాయి సాగు చేసిన 110 మంది రైతులకు రైతు భరోసా నిలిపివేసినట్లు ఆయన తెలిపారు.
దీనిని కూడా చదవండి : Helicopter Crash | పీవోకేలో కూలిన పాక్ ఆర్మీ హెలికాప్టర్.. 21 మంది మృతి
