అక్షరటుడే, వెబ్‌డెస్క్: Atiq Ahmed Son Death | గ్యాంగ్‌స్టర్, రాజకీయ నాయకుడైన దివంగత అతీక్ అహ్మద్ కుమారుడు అబాన్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. అతివేగంగా వెళ్తున్న తన వాహనం సిమెంట్ డివైడర్‌ను ఢీకొట్టడంతో జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించాడు. ఆ వాహనంలోనే ప్రయాణిస్తున్న అతని సహచరుడు సోను కూడా మరణించినట్లు పోలీసులు తెలిపారు.
జైలులో ఉన్న తన అన్నయ్యను కలిసేందుకు ప్రయాగ్‌రాజ్ (Prayagraj) నుండి ఝాన్సీకి వెళ్తుండగా ఆబాన్ ఈ ప్రమాదానికి గురయ్యాడు. అతిక్ అహ్మద్ కుటుంబానికి సంబంధించిన హింసాత్మక ఘటనల చరిత్రలో ఇది మరొక సంఘటన. అతిక్ అహ్మద్ 2023లో హత్యకు గురయ్యాడు. పోలీస్ కస్టడీలో ఉన్న అతడిని దుండుగులు కాల్చి చంపారు. అతడి కుమారుడు అసద్, సోదరుడు సైతం హత్యకు గురయ్యారు. తాజాగా మరో కుమారుడు అబాన్ రోడ్డు ప్రమాదంలో మరణించడం గమనార్హం.
Atiq Ahmed Son Death | ఎన్కౌంటర్లో..
అతిక్ అహ్మద్ కుమారుడు, 19 ఏళ్ల అసద్ అహ్మద్, తన సహచరుడు గులామ్‌తో కలిసి ఝాన్సీ సమీపంలో ఉత్తరప్రదేశ్ స్పెషల్ టాస్క్ ఫోర్స్‌తో జరిగిన ఎన్కౌంటర్లో 2023 ఏప్రిల్ 13న మరణించాడు. అసద్ మరణించిన రెండు రోజుల తర్వాత 2023 ఏప్రిల్ 15న, అతిక్ అహ్మద్, అతని సోదరుడు ఖలీద్ అజీమ్ (అష్రఫ్ అని కూడా పిలుస్తారు) ప్రయాగ్‌రాజ్‌లో హత్యకు గురయ్యారు. పోలీసులు ఆ సోదరులను వైద్య పరీక్షల కోసం తీసుకెళ్తుండగా, మీడియా ప్రతినిధుల వేషధారణలో వచ్చిన ముగ్గురు దుండగులు వారిపై కాల్పులు జరిపారు. కాగా అతీక్ అహ్మద్ యూపీలో నేర సామ్రాజ్యాన్ని విస్తరించాడు. ఆయనపై అనేక క్రిమినల్ కేసులు ఉన్నాయి. సమాజ్‌వాది పార్టీ హాయంలో అతీక్ ఎంపీగా కూడా ఎన్నికయ్యాడు.
ఇది కూడా చదవండి..: Patna Medical Negligence | వైద్యుల నిర్లక్ష్యం.. చెవి నొప్పితో ఆసుపత్రికి వెళ్తే చేయి కోల్పోయిన యువతి