అక్షరటుడే, వెబ్‌డెస్క్: Ganga River Tragedy | బీహార్ (Bihar)లోని విషాదకర ఘటన చోటు చేసుకుంది. బఖ్తియార్‌పూర్ సమీపంలోని గంగా నదిలో స్నానం చేస్తుండగా నలుగురు బాలికలు గల్లంతయ్యారు.
పాట్నాలోని బఖ్తియార్‌పూర్‌లో సోమవారం ఏడుగురు బాలికలు గంగా నదిలో స్నానం చేస్తుండగా నీట మునిగిపోయారు. స్థానికులు వారిలో ముగ్గురిని కాపాడారు. వరద ఉధృతికి నలుగురు కొట్టుకుపోయారు. గల్లంతైన వారిని అవధేష్ చంద్రవంశీ కుమార్తెలైన ఆర్తి (21), నందని (16), కమలేష్ చంద్రవంశీ కుమార్తె రాధిక (15), మంటు చంద్రవంశీ కుమార్తె బబ్లీ (6)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇప్పటికే రెండు మృతదేహాలను వెలికితీశారు. మరో ఇద్దరి కోసం గాలిస్తున్నారు.
Ganga River Tragedy | కాపాడే ప్రయత్నంలో..
ఈ ఘటన ఉదయం 7:30 గంటలకు జరిగింది. బాలికలు ప్రతిరోజూ మాదిరిగానే స్నానం చేయడానికి రాణిసరాయ్ గంగా ఘాట్‌కు వెళ్లారు. ఒక బాలిక నీట మునిగిపోతుండగా, మిగిలిన వారు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించారు. ఇలా ఒకరి కోసం ఒకరి వెళ్లి ఏడుగురు నీటిలో మునిగిపోయారు. గమనించిన స్థానికులు నదిలోకి దూకి ముగ్గురిని బయటకు తీశారు. కాగా బాలికలు అందరు బంధువులు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఇది కూడా చదవండి..: Railway Engineer Bribe | రూ.15 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన రైల్వే ఇంజినీర్