Eluru Pastor Arrest | మైన‌ర్​పై చ‌ర్చి పాస్ట‌ర్ అత్యాచారం.. గర్బం దాల్చిన బాలిక!

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Eluru Pastor Arrest | మైన‌ర్ బాలికపై చ‌ర్చి పాస్ట‌ర్ అత్యాచారం చేసిన ఘటన ఆంధ్రప్రదేశ్​లో వెలుగుచూసింది. బాలిక  గర్బం దాల్చడంతో ఈ దారుణం వెలుగుచూసింది.

Eluru Pastor Arrest | లైంగిక దాడి..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం కళ్లచెరువులో బాలికపై చర్చి పాస్టర్ లైంగిక దాడికి పాల్పడ్డాడు. గ్రామంలో చర్చి పాస్టర్‌గా పనిచేస్తున్న చౌటపల్లి రాంబాబు (42) గత కొంతకాలంగా మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడుతున్నాడు.

Eluru Pastor Arrest | మోతాదుకు మించి మాత్రలు మింగించి..

గర్భం దాల్చడంతో బాలికతో రాంబాబు మోతాదుకు మించి గర్బనిరోధక మాత్రలు మింగించాడు. ఈ నేపథ్యంలో తీవ్ర రక్తస్రావంతో బాలిక అనారోగ్యం పాలైంది. దీంతో బాలికను వైద్యం నిమిత్తం తల్లిదండ్రులు ఏలూరు తరలించారు.

పశువాంఛతో పాస్టర్ తనపై జరిపిన అఘాయిత్యాన్ని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పింది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడు చర్చి పాస్టర్ రాంబాబును అదుపులోకి తీసుకున్నారు. విచారణ కొనసాగుతోంది.

Nagpur Assault Case | సవతి తల్లిపై అత్యాచారం.. గర్భవతిని చేసిన యువకుడి అరెస్టు

Kadapa Hotel Incident | శృంగారంలో అపశృతి.. విలేకరి నాలుక కొరికిన మహిళ

Follow:
గత 18 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *