అక్షరటుడే, వెబ్‌డెస్క్: Kadapa Hotel Incident | ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా ఒంటిమిట్టలో జరిగిన ఘటన చర్చనీయాంశంగా మారింది. శృంగారంలో పాల్గొన్న మహిళ విటుడి నాలుక కొరికి వేయడమే ఇందుకు కారణం.
కర్బూజ వ్యాపారం చేసే ఓ పత్రికా విలేకరి రవిబాబు, ఆటో డ్రైవర్ హరికి ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. ఇటీవల వీరు ముగ్గురు కలిసి ఒంటిమిట్టలోని హరిత హోటల్‌కు వెళ్లారు. అక్కడ సిబ్బంది అడ్డుకున్నా.. విలేకరి తన పరపతిని ఉపయోగించి లోపలికి దూరారు.
Kadapa Hotel Incident | తీవ్ర రక్తస్రావం
గదిలోకి వెళ్ళిన తర్వాత ముగ్గురూ కలిసి మద్యం తాగారు. ఆపై జరిగిన శృంగారంలో సదరు మహిళ విలేకరి రవిబాబు నాలుకను బలంగా కొరికివేసింది. దీంతో బెడ్‌తోపాటు ఆ ప్రదేశమంతా రక్తసిక్తమైంది.
తీవ్ర రక్తస్రావం కావడంతో భయపడ్డ రవిబాబు వెంటనే స్థానిక PHCకి పరిగెత్తాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితుడిని వైద్యులు 108లో కడప రిమ్స్ (RIMS)కు తరలించారు. ఈ లోపు సదరు మహిళను ఆటో డ్రైవర్ రైల్వే స్టేషన్ దగ్గర వదిలిపెట్టి పారిపోయాడు.
Kadapa Hotel Incident | మెమో జారీ
ప్రస్తుతం ఆ మహిళ పరారీలో ఉంది. కాగా, అఘాయిత్యం నుంచి తప్పించుకోవడానికి ఆమె కొరికిందా..? లేక మరేదైనా కారణమా..? అనేది పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. ఆటో డ్రైవర్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన హరిత హోటల్ మేనేజర్‌కు ఉన్నతాధికారులు మెమో జారీ చేశారు.
Hantavirus WHO Alert | కొవిడ్‌ను మించిన వైరస్.. ప్రపంచ దేశాలను అలర్ట్ చేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ

