Nandipadu Child Assault | తొమ్మిదేళ్ల బాలికపై లైంగిక దాడి.. నిందితుడు అరెస్ట్

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఓ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Nandipadu Child Assault | భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని ఓ గ్రామంలో అమానుష ఘటన చోటుచేసుకుంది. తొమ్మిదేళ్ల బాలికపై ఒక కామాంధుడు లైంగిక దాడికి పాల్పడటం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Nandipadu Child Assault | ఘటన వివరాలు..

వేసవి సెలవులు కావడంతో బాలిక తన బంధువుల ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో కూల్ డ్రింక్ కొనుక్కునేందుకు గ్రామంలోని ఒక షాపునకు ఒంటరిగా వెళ్లింది. బాలిక ఒంటరిగా ఉండటాన్ని గమనించిన లక్ష్మణ్‌రావు (55) అనే వ్యక్తి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.

Nandipadu Child Assault |చితకబాదిన బంధువులు..

విషయం తెలిసిన బాలిక కుటుంబ సభ్యులు, స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడు లక్ష్మణ్‌రావును పట్టుకుని దేహశుద్ధి చేశారు. బంధువుల దాడి నుండి తప్పించుకునేందుకు నిందితుడు అక్కడి నుంచి పారిపోయి, నేరుగా పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు.

Nandipadu Child Assault | కేసు నమోదు..

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Indian Sailors Death | భారత నావికుల ప్రాణాలు పోతే.. కేంద్రం ఎందుకు ఇంత మెతక వైఖరి?: పవన్ ఖేరా

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *