TGSPDCL Power Supply | విద్యుత్​ సరఫరాకు అంతరాయం లేకుండా చర్యలు : ఎస్పీడీసీఎల్

వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు చేపట్టినట్లు ఎస్​పీడీసీఎల్ అధికారులు తెలిపారు.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : TGSPDCL Power Supply | వర్షాకాలం నేపథ్యంలో విద్యుత్​ సరఫరాకు అంతరాయం కలకుండా చర్యలు చేపట్టినట్లు టీజీఎస్పీడీఎల్​ అధికారులు తెలిపారు. ఎక్కడైనా స్థంభాలు పడిపోయిన, విద్యుత్​ తీగలు తెగిపోయిన యుద్ధ ప్రతిపాదికన పునరుద్ధణ చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.

భారీ వర్షాలు, ఈదురుగాలుల సమయంలో కూడా వినియోగదారులకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు. టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ జితేష్ వి. పాటిల్ ఆదేశాల మేరకు అధికారులు దెబ్బతిన్న, శిథిలావస్థకు చేరుకున్న విద్యుత్ స్థంభాల పునరుద్ధరణ పనులను వేగవంతం చేశారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్థంభాలు ఏర్పాటు చేస్తున్నారు.

TGSPDCL Power Supply | స్పెషల్​ డ్రైవ్​

వర్షాకాలం నేపథ్యంలో ప్రత్యేక డ్రైవ్ (Special Drive) చేపట్టి అవసరమైన ప్రాంతాల్లో కొత్త విద్యుత్ స్థంభాల ఏర్పాటు, లూజ్ లైన్ల సవరణ, వంగిపోయిన, దెబ్బతిన్న విద్యుత్ స్థంభాల మరమ్మతులు చేపడుతున్నారు. విద్యుత్ లైన్ల భద్రతను దృష్టిలో ఉంచుకుని తీగలకు ఆనుకుని పెరిగిన చెట్ల కొమ్మల తొలగింపు (ట్రీ ట్రిమ్మింగ్) కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాల నిర్వహణ కోసం టీజీఎస్పీడీసీఎల్ ఆధునిక పరికరాలను సమకూర్చుకుంది. 168 కొత్త పోల్ ప్రూనర్లు కొనుగోలు చేయనుండగా, ప్రస్తుతం ఉన్న 40 పరికరాలతో కలిపి మొత్తం 208 పోల్ ప్రూనర్లు అందుబాటులో రానున్నాయి. నూతనంగా 59 కొత్త చైన్‌సాలను కొనుగోలు చేశారు. 530 ప్రూనింగ్ కట్టర్లు కూడా అందుబాటులోకి తేనున్నారు.

TGSPDCL Power Supply | ప్రత్యేక బృందాలు

విద్యుత్ అంతరాయాలు, అత్యవసర పరిస్థితులను త్వరితగతిన పరిష్కరించేందుకు 189 ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (ERT) వాహనాలను సిద్ధంగా ఉంచారు. కోర్ అర్బన్ రీజియన్ (CURE) పరిధిలో ఫ్యూజ్ ఆఫ్ కాల్ (FOC) సేవల కోసం 213 ప్రత్యేక బృందాలను నియమించారు. వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం 1912 టోల్-ఫ్రీ విద్యుత్ హెల్ప్‌లైన్‌ను 24 గంటలూ అందుబాటులో ఉంచారు.

దీనిని కూడా చదవండి : Bungee Jump Death | సేఫ్టీ రోప్​ కట్టడం మర్చిపోయారు.. యువతి ప్రాణం తీసిన బంగి జంప్​

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *