అక్షరటుడే, వెబ్‌డెస్క్: TG SAFE Raids | టీజీ సేఫ్ అధికారులు దూకుడు పెంచారు. ఓ వైపు ఆహార కల్తీని అరికట్టడానికి తయారీ కేంద్రాలు, హోటళ్లు, రెస్టారెంట్లలో నిత్యం తనిఖీలు చేస్తున్నారు. మరోవైపు నకిలీ మందులు, ఇష్టారీతిని మెడిసిన్ విక్రయాలను అరికట్టేందుకు చర్యలు చేపట్టారు.
రాష్ట్రం (Telangana)లోని ఆన్‌లైన్ ఫార్మసీ నెట్‌వర్క్‌లపై టీజీ సేఫ్ అధికారులు గురువారం దాడులు చేశారు. టాటా 1mg, నెట్‌మెడ్స్, జెప్టో, అపోలో 24/7, మెడ్‌ప్లస్ మార్ట్, ఇన్‌స్టామార్ట్‌లకు అనుబంధంగా ఉన్న 106 మెడికల్ షాపులలో తనిఖీలు చేశారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మడం, బిల్లులు, కొనుగోలు రసీదులు, షెడ్యూల్ H1 రిజిస్టర్లలో లోపాలు, అర్హత కలిగిన ఫార్మసిస్ట్ పర్యవేక్షణ లేకుండా మందులు పంపిణీ చేసినందుకు 32 షాపులకు షో-కాజ్ నోటీసులు జారీ చేశారు.
TG SAFE Raids | నిబంధనలు పాటించాలి
ఆన్‌లైన్ మెడిసిన్ డెలివరీ ముసుగులో నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న ఔషధ విక్రయాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు విక్రయించొద్దని సూచించారు. మెడికల్ దుకాణాల నిర్వాహకులు నిబంధనలు పాటించాలన్నారు. దాడులు కొనసాగుతాయని, నిబంధనలు పాటించని దుకాణాల లైసెన్స్‌లు రద్దు చేస్తామని హెచ్చరించారు.
ఇది కూడా చదవండి..: Konda Surekha Apology | కేటీఆర్‌కు క్షమాపణ చెప్పిన కొండా సురేఖ