అక్షరటుడే, వెబ్‌డెస్క్: Konda Surekha Apology |మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు క్షమాపణ చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ఆమె పోస్ట్ చేశారు.
కొండా సురేఖ గతంలో కేటీఆర్ (KTR)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ అంశంలో ఆయనపై ఆరోపణలు చేశారు. ఆ సమయంలో ఆమె వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే తాజాగా వాటిపై ఆమె వివరణ ఇవ్వడం గమనార్హం. అప్పటి రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో, ప్రతిపక్షాన్ని విమర్శించే క్రమంలో తాను ఆ వ్యాఖ్యలు చేసినట్లు పేర్కొన్నారు. ఉద్దేశపూర్వకంగా చేయలేదన్నారు.
Konda Surekha Apology | వెనక్కి తీసుకుంటున్నా
ఆ సమయంలో తాను కొన్ని నిరాధారమైన వ్యాఖ్యలు చేయకుండా ఉండాల్సిందని సురేఖ అన్నారు. కేటీఆర్, ఆయన కుటుంబ సభ్యులను బాధపెట్టాలని గానీ, వారి ప్రతిష్టకు భంగం కలిగించాలనే దురుద్దేశం తనకు లేవన్నారు. తన వ్యాఖ్యలు వారి కుటుంబ సభ్యులను నొప్పించి ఉంటే అందుకు చింతిస్తూ, ఉపసంహరించుకుంటున్నానని పేర్కొన్నారు.
Konda Surekha Apology | పార్టీ మారతారా..
కొండా సురేఖ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే మంత్రి అయ్యారు. అనంతరం ఆమె తరచు వివాదాల్లో నిలిచారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కొండా దంపతులకు మధ్య విభేదాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో సురేఖ కూతురు కొండా సుష్మిత సీఎం రేవంత్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు, తీవ్ర ఆరోపణలు చేశారు. దీంతో అధిష్టానం సురేఖను మంత్రి పదవి నుంచి తొలగించింది. సెప్టెంబర్ 3న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొండా సురేఖను మంత్రివర్గం నుండి తొలగించాలని గవర్నర్ కు సిఫారసు చేశారు. గవర్నర్ వెంటనే ఆమోదించారు. అప్పటి నుంచి కాంగ్రెస్‌లోనే ఉన్న ఆమె తాజాగా.. కేటీఆర్‌కు క్షమాపణ చెప్పడం వెనుక ఆంతర్యం ఏమిటనే ప్రశ్నలు తలెత్తున్నాయి. ఆమె మళ్లీ గులాబీ గూటికి వస్తారా అని పలువురు చర్చించుకుంటున్నారు.
ఇది కూడా చదవండి..: Forest Beat Officer Jobs | 1,395 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్