Forest Beat Officer Jobs | 1,395 ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ పోస్టులకు త్వరలో నోటిఫికేషన్​

రాష్ట్రంలో 1,395 ఫారెస్ట్​ బీట్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి టీజీపీఎస్సీ త్వరలో నోటిఫికేషన్​ విడుదల చేయనుంది.

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Forest Beat Officer Jobs | రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్​ న్యూస్​ చెప్పింది. ఫారెస్ట్ బీట్​ ఆఫీసర్​ పోస్టుల భర్తీకి త్వరలో నోటిఫికేషన్​ విడుదల చేయనుంది. ఈ మేరకు టీజీపీఎస్సీ కసరత్తు చేస్తోంది.

తెలంగాణ (Telangana) పబ్లిక్​ సర్వీస్​ కమిషన్​ (TGPSC) బుధవారం 102 ఏఎస్​వో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్​ విడుదల చేసిన విషయం తెలిసింది. నవంబర్​లో అటవీ శాఖలో 1,395 ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ (FBO) ఉద్యోగాల భర్తీకి కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేయనుంది. దీంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Forest Beat Officer Jobs | ఆ జిల్లాల్లో అధికం

మొత్తం 1,395 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆదిలాబాద్, కుమురం భీమ్ ఆసిఫాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో ఎక్కువ ఖాళీలు ఉన్నాయి. ఇంటర్​ పాసైన వారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వయోపరిమితి 18 నుండి 31 ఏళ్లు ఉండాలి. (BC/SC/ST అభ్యర్థులకు 36 ఏళ్ల వరకు, దివ్యాంగులకు (PwBD) 41 ఏళ్ల వరకు సడలింపులు వర్తిస్తాయి). ఉద్యోగం సాధించిన వారికి నెలకు రూ.35 వేల నుంచి రూ.42 వేల వరకు జీతం అందుతుంది.

ఇది కూడా చదవండి..: Hitec City Traffic Loop | ఐటీ కారిడార్‌లో నిరంతర ప్రయాణమే లక్ష్యం.. కేబీఆర్ పార్క్ మోడల్‌లో వన్-వే లూప్ సిస్టమ్‌కు శ్రీకారం!

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *