Kavitha New Party | ఇక పిట్టల దొరసాని క్యారెక్టర్​ను చూస్తాం.. కవిత కొత్త పార్టీపై ఎంపీ అర్వింద్​ సెటైర్లు..

Shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Kavitha New Party | ఇన్నాళ్లు రాష్ట్రంలో పిట్టలదొరను చూశామని.. ఇప్పటి నుంచి పిట్టల దొరసానిని చూస్తామని ఎంపీ అర్వింద్ (MP Arvind)​ కవితపై సెటైర్లు వేశారు. హైదరాబాద్​లోని (Hyderabad) పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘తెలంగాణ రాష్ట్ర సేన’ (Telangana Rashtra Sena) పేరుతో కల్వకుంట్ల కవిత కొత్త పార్టీ (Kavitha party) పెట్టడంపై ఆయన స్పందించారు.

Kavitha New Party | బీఆర్​ఎస్​ హ్యాంగోవర్​లోనే కవిత..

బీఆర్​ఎస్ (BRS)​ నుంచి కవిత వైదొలిగినప్పటికీ ఇంకా ఆమె బీఆర్​ఎస్​ హ్యాంగోవర్​లోనే ఉన్నారని ఎద్దేవా చేశారు. వాస్తవాలను గుర్తించకుండా ఆమె మాట్లాడుతున్నారన్నారు. బీఆర్​ఎస్ తోక పార్టీనే టీఆర్​ఎస్​ అని.. కవితను బీజేపీ (BJP) ఎప్పుడో మరిచిపోయిందన్నారు. ప్రత్యేకంగా ఆమె గురించి మాట్లాడాల్సిన అవసరం లేని ఆయన స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఏ కొత్త పార్టీ వచ్చినా బీజేపీని ఏమి చేయలేవన్నారు. సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టి వాళ్లను ఓడించి.. బీజేపీని ప్రజలు గెలిపించారన్నారు. ఆమెకు రాజకీయ సమాధి కట్టింది బీజేపీ అన్నారు. కవితకి కేసీఆర్‌ రజనీకాంత్‌లా కనబడుతున్నారా? కేసీఆర్‌ రోబో అయ్యారా..? అర్వింద్​ ప్రశ్నించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్​రావు మాట్లాడుతూ.. కవిత ప్రారంభించబోయే కొత్త పార్టీ రాజకీయ అస్తిత్వంపై అనేక అనుమానాలున్నాయన్నారు.

Kavitha New Party |

ఇది కూడా చదవండి: TRS Panchajanyam | తెలంగాణ రాష్ట్ర సేన ‘పాంచజన్యం’.. ఐదు హామీలతో కవిత మార్క్ పాలిటిక్స్!

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *