Dinesh Kulachari | భూపతిరెడ్డితో బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధమే : దినేష్​ కులాచారి

ఎమ్మెల్యే భూపతిరెడ్డితో బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధమేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Dinesh Kulachari | ఎమ్మెల్యే భూపతిరెడ్డితో (MLA Bhupathi Redd) బహిరంగ చర్చకు ఎప్పుడైనా సిద్ధమేనని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్​ కులాచారి అన్నారు. ఈ మేరకు నగరంలోని(Nizamabad) పార్టీ కార్యాలయంలో బుధవారం మాట్లాడారు.

Dinesh Kulachari | నోటికొచ్చినట్లు మాట్లాడితే ఊరుకోం..

దినేష్​ కులాచారి మాట్లాడితే.. ఎంపీ అర్వింద్​పై మరోసారి ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని భూపతిరెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఎమ్మెల్యే, సీఎం చేతగానితనం వల్లే నిజామాబాద్‌లో ఆర్వోబీ పనులు నత్తనడకన సాగుతున్నాయన్నారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను చూసి, పెండింగ్ నిధులు విడుదల చేయాలని అర్వింద్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని కలిసిన తర్వాత రూ.9 కోట్లు రిలీజ్ చేయాలని ఫైనాన్స్ డిపార్ట్మెంట్​కు పంపిస్తే ఫైల్ ఇంకా పెండింగ్​లో ఉంచి రాష్ట్ర ప్రభుత్వం నాటకాలు ఆడుతోందన్నారు. దీనికి నిరసనగానే అర్వింద్ భిక్షాటన చేశారన్నారు.

Dinesh Kulachari | నీలాగా అడుక్కోవడం లేదు..

ఎమ్మెల్యే భూపతిరెడ్డి లాగా.. ఇటుక బట్టీల దగ్గర, మొరం క్వారీల దగ్గర, ఇసుక క్వారీల దగ్గర అడుక్కోవడం లేదని దినేష్​ కులాచారి సంచలన వ్యాఖ్యలు చేశారు. భూపతిరెడ్డి చేసిన నిరాధార ఆరోపణలపై స్పందిస్తున్నానని.. బహిరంగ చర్చకు ఎక్కడికి వస్తావో చెప్పాలన్నారు. ప్రెస్​ క్లబ్‌కు వస్తావా.. లేక రైల్వే బ్రిడ్జి వద్దకే వస్తావా అని సవాల్​ విసిరారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే బ్రిడ్జి పనులను ఆపిందని రుజువు చేసే డాక్యుమెంట్లు తీసుకొనిరా అని పేర్కొన్నారు. ఆర్వోబీపై కనీస అవగాహన లేని భూపతిరెడ్డి దానిపై మాట్లాడే హక్కు లేదన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దంపల్లి జ్యోతి, ఎర్రం సుదీర్, పద్మరెడ్డి, బొబ్బిలి వేణు, అమంద్ విజయ్ కృష్ణ, ఇప్పాకాయల కిషోర్, చింతకాయల రాజేందర్, బద్దం కిషన్, మల్లేష్ యాదవ్, పురుషోత్తం, జగదీష్ కులకర్ణి తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: బీజేపీ వాళ్లకి..రోడ్డుపై కూర్చోవడం అలవాటు 

 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *