అక్షరటుడే, భీమ్గల్: Vemula Prashanth Reddy | టీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) తనపై చేసిన ఆరోపణలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నానని మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. లింబాద్రి లక్ష్మీనృసింహాస్వామి సన్నిధిలో బీఆర్ఎస్ నాయకులతో కలిసి ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కవిత వ్యాఖ్యలపై స్పందించారు.
Vemula Prashanth Reddy | కేసీఆర్ సైనికుడిని..
రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోగానే తాను కాంగ్రెస్ నాయకులతో మంతనాలు జరిపానని పేర్కొనడం పూర్తిగా అవాస్తవమన్నారు. కేసీఆర్కు, పార్టీకి నేను ఎల్లప్పుడూ విశ్వసనీయమైన సైనికుడిగానే ఉన్నానన్నారు. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పార్టీలోనే కొనసాగుతున్నానని.. నేను కాంగ్రెస్తో మంతనాలు జరిపాననడం కేవలం అసత్య ప్రచారమన్నారు. కవితనే రహస్యంగా కాంగ్రెస్ నేతలతో చర్చలు జరిపారా అనేదానిపై ఆమెకే స్పష్టత ఉండాలని వ్యాఖ్యానించారు.
Vemula Prashanth Reddy | ‘కాంగ్రెస్ బాకీ కార్డు’తో వినూత్న నిరసన..
ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను విస్మరించి, ప్రజలను కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసగించిందని మాజీ మంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెల్లించాల్సిన బాకీలను వివరిస్తూ రూపొందించిన ‘కాంగ్రెస్ బాకీ కార్డు’ను స్వామివారి పాదాల చెంత ఉంచారు. అనంతరం ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలను అమలు చేస్తామని దేవుళ్లపై ఒట్టు వేసి, అధికారంలోకి వచ్చాక రేవంత్ రెడ్డి మాట తప్పారని దుయ్యబట్టారు.
ఇది కూడా చదవండి..: Pension Protest Day | అపరిష్కృత సమస్యలపై ఉద్యోగుల నిరసన.. టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో ‘పెన్షన్ విద్రోహ దినం’