Bandi Sanjay Son POCSO Case | బండి సంజయ్​ కుమారుడిపై కేసు.. సిట్​ ఏర్పాటు చేసిన ప్రభుత్వం

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్: Bandi Sanjay Son POCSO Case | రాష్ట్ర ప్రభుత్వం (State Government) కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్​ కుమారుడిపై నమోదైన పోక్సో కేసు విచారణకు సిట్​ను ఏర్పాటు చేసింది.

బండి సంజయ్​ కుమారుడిపై పోక్సో కేసు నమోదైన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) డీజీపీ సీవీ ఆనంద్​ (DGP CV Anand)తో చర్చించారు. విచారణ తక్షణమే ప్రారంభించాలని ఆదేశించారు. అనంతరం సిట్​ ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం గమనార్హం.

Bandi Sanjay Son POCSO Case | లైంగికంగా వేధించాడని..

తమ కూతుర్ని లైంగికంగావేధించాడని భగీరథ్‌పై బాలిక తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పేట్‌బషీరాబాద్‌ పోలీసులు (Petbasheerabad Police) కేసు నమోదు చేశారు. సీఎం ఆదేశాలతో సిట్‌ ఏర్పాటు చేస్తూ డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్‌పల్లి డీసీపీ రుతిరాజ్‌ సిట్​కు నేతృత్వం వహించనున్నారు.

ఇది కూడా చదవండి..: Bandi Sanjay Son | బండి సంజయ్​ కుమారుడిపై కేసు.. సీఎం కీలక ఆదేశాలు

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *