తెలంగాణBandi Sanjay Son | బండి సంజయ్​ కుమారుడిపై కేసు.. సీఎం కీలక ఆదేశాలు

Bandi Sanjay Son | బండి సంజయ్​ కుమారుడిపై కేసు.. సీఎం కీలక ఆదేశాలు

బండి సంజయ్​ కుమారుడిపై నమోదు అయిన కేసులో తక్షణమే విచారణ ప్రారంభించాలని సీఎం రేవంత్​రెడ్డి ఆదేశించారు.

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Bandi Sanjay Son | కేంద్ర మంత్రి బండి సంజయ్​ కుమారుడు భగీరథ్​ సాయిపై పోక్సో కేసు (POCSO Case) నమోదు అయిన విషయం తెలిసిందే. ఈ వ్యవహారంపై తాజాగా సీఎం రేవంత్​రెడ్డి (CM Revanth Reddy) స్పందించారు.

మైనర్​ బాలికను వేధించాడని పేట్​బషీర్​బాద్​ ఠాణాలో భగీరథ్​పై కేసు నమోదు అయింది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో భగీరథ్‌పై నమోదైన కేసుపై తక్షణమే విచారణ ప్రారంభించాలని డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand)​ను సీఎం ఆదేశించారు. 8వ తేదీనే ఫిర్యాదు నమోదైనప్పటికీ, చర్యలు తీసుకోవడంలో జరిగిన జాప్యంపై ముఖ్యమంత్రి DGPని ప్రశ్నించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను DGP ఆనంద్ ముఖ్యమంత్రికి వివరించారు.

Bandi Sanjay Son | ప్రధాని పర్యటన నేపథ్యంలో..

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) హైదరాబాద్ పర్యటన దృష్ట్యా, మొత్తం పోలీస్ యంత్రాంగం భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉందని డీజీపీ ముఖ్యమంత్రికి తెలియజేశారు. దీంతో చర్యలు తీసుకోవడంలో ఆలస్యం అయిందన్నారు. ఈ కేసుపై సమగ్ర విచారణ జరిపేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

పేట్ బ‌షీరాబాద్ పోలీస్ స్టేష‌న్​లో బండి భ‌గీర‌థ్ మీద‌ న‌మోదైన పోక్సో కేసుపై తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (TSCPCR) ఛైర్‌పర్సన్‌ కొత్తకోట సీతా దయాకర్ రెడ్డి స్పందించారు. న‌గ‌ర పోలీస్ క‌మిష‌న‌ర్ నుంచి వివ‌రాలు తెప్పించుకుని విచార‌ణ కోసం ప్ర‌త్యేక బెంచ్ ఏర్పాటు చేశారు.

ఇది కూడా చదవండి..: Modi Telangana Visit | తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

Balla Sandeep Kumar
Balla Sandeep Kumarhttps://aksharatodaynews.com/
Author Bio : తెలుగు జర్నలిజంలో 19 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2007 డిసెంబర్​లో ‘సాక్షి’ దినపత్రికలో జూనియర్​ ఆర్టిస్ట్​గా చేరాను. 2010లో జర్నలిజంలో శిక్షణ పొంది సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. అనంతరం నమస్తే తెలంగాణ దినపత్రికలో 2011లో చేరి రెండు సంవత్సరాల పాటు పనిచేశాను. ఆ తర్వాత ‘సాక్షి’ దినపత్రికలో 2013 నుంచి 2024 జూలై వరకు సీనియర్​ సబ్​ ఎడిటర్​గా వర్క్​ చేశాను. 2024 ఆగస్టు నుంచి ‘అక్షరటుడే’లో అసోసియేట్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, లోకల్​, నేషనల్​, ఇంటర్నేషనల్​, క్రైం, లైఫ్​స్టైల్​, సినిమా ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.

Share post:

Popular

More like this
Related

Nizamabad Co-option Election | ముగిసిన నిజామాబాద్​ కో–ఆప్షన్ సభ్యుల ఎన్నిక

అక్షరటుడే, నిజామాబాద్​ సిటీ: Nizamabad Co-option Election | నిజామాబాద్​ మున్సిపల్​...

Gold Traders Tension | బంగారం వ్యాపారుల్లో టెన్షన్.. రేపు పీఎంవో అధికారులతో భేటీ!

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Traders Tension | రాబోయే ఏడాది...

Illegal Gravel Excavation | మొరం అక్రమ తవ్వకాలపై చీతా ఫోర్స్ మెరుపు దాడి

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Illegal Gravel Excavation | మొరం అక్రమ...

Gold Purchase Ban | ఏడాదిపాటు బంగారం కొనొద్దు.. మోదీ రిక్వెస్ట్ వెనక వ్యూహమేంటీ?

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Gold Purchase Ban | “ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న...