Vaddi Leni Runalu | మహిళా సంఘాలకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్: వడ్డీ లేని రుణాలు రూ.10 లక్షలకు పెంపు

Naresh Chandan

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Vaddi Leni Runalu | తెలంగాణలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు (SHG) రాష్ట్ర ప్రభుత్వం మరో తీపి కబురు అందించింది. మహిళలకు ప్రస్తుతం ఇస్తున్న వడ్డీ లేని రుణాల పరిమితిని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ప్రకటించారు.

Vaddi Leni Runalu | ఆర్థిక సాధికారత కల్పించడమే..

హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో శుక్రవారం జరిగిన 49వ రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశంలో (SLBC) ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ, రాష్ట్రంలో మహిళలకు ఆర్థిక సాధికారత కల్పించడమే ఇందిరమ్మ ప్రభుత్వ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు.

మహిళా సంఘాల బలోపేతానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగానే వడ్డీ లేని రుణాల పరిమితిని రెట్టింపు చేయాలని నిర్ణయించామని వెల్లడించారు.

ఈ నిర్ణయం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది మహిళలు మరింత మెరుగ్గా స్థిరపడటానికి, పెద్ద ఎత్తున స్వయం ఉపాధి, కుటీర పరిశ్రమలు స్థాపించడానికి మార్గం సుగమం అవుతుందని పేర్కొన్నారు.

Vaddi Leni Runalu | తెలంగాణ వృద్ధి రేటు దేశ సగటు కంటే వేగం

పారిశ్రామిక, ఆర్థిక రంగాల్లో దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటని భట్టి విక్రమార్క కొనియాడారు. దేశ సగటు వృద్ధి రేటు కంటే తెలంగాణ వేగవంతమైన వృద్ధిని నమోదు చేస్తోందని హర్షం వ్యక్తం చేశారు.

రాబోయే 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ఒక ప్రణాళికాబద్ధమైన వ్యూహంతో ముందుకు సాగుతోందని ఆయన వివరించారు.

Vaddi Leni Runalu | బ్యాంకర్లు సహకరించాలి

గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థ బలోపేతంలో బ్యాంకుల పాత్ర ఎంతో కీలకమని, మహిళా సంఘాలకు మరియు ప్రాధాన్యం రంగాలకు బ్యాంకర్లు పెద్దపీట వేయాలని డిప్యూటీ సీఎం కోరారు.

ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలకు బ్యాంకులు తమ వంతుగా తగిన రుణ సాయాన్ని అందించి తోడ్పాటునందించాలని పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉన్నతాధికారులు మరియు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొని రాష్ట్ర రుణ ప్రణాళిక, రైతులు, మహిళా సంఘాల పురోగతిపై విస్తృతంగా చర్చించారు.

Varalakshmi Controversial Comments | మగాడు కేవలం ‘స్పేర్ పార్ట్’ మాత్రమేనా?…..

Follow:
గత 19 సంవత్సరాలుగా ప్రింట్, డిజిటల్​ మీడియా రంగంలో పనిచేస్తున్నాను. 2008లో ఈనాడు ద్వారా మీడియాలోకి అడుగుపెట్టాను. 2015లో మనం పత్రికకు స్టాఫర్​గా, 2016లో మన తెలంగాణకు బ్యూరోగా పనిచేశాను. 2017లో ఈనాడులో సబ్ ఎడిటర్​గా నా ప్రయాణం మొదలెట్టాను. 2023 నుంచి అక్షరటుడే వెబ్ న్యూస్​లో సీనియర్​ న్యూస్​ ఎడిటర్​గా కొనసాగుతున్నాను. పొలిటికల్​, ఎడ్యుకేషన్​, క్రైం, ట్రెండింగ్​తోపాటు నేషనల్​, ఇంటర్నేషనల్, లైఫ్​స్టైల్​​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *