Singer Mangli | మైక్రోఫైనాన్స్ కేసులో కీలక మలుపు.. మంగ్లీ సోదరుడి అకౌంట్​లోకి డబ్బులు

Srinivas Kolluri

అక్షరటుడే, వెబ్​డెస్క్ : Singer Mangli | మైక్రో ఫైనాన్స్​ కేసు (Microfinance Case)లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు రమావత్ మధు (Ramavath Madhu) అకౌంట్​ నుంచి సింగర్​ మంగ్లీ సోదరుడు శివచౌహన్​ అకౌంట్​కు డబ్బులు ట్రాన్స్​ఫర్​ అయినట్లు పోలీసులు గుర్తించారు.

మంగ్లీ ఇటీవల ఓ వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. రియల్ ఎస్టేట్ (Real Estate) పెట్టుబడుల పేరుతో రమావత్​ మధు అనే వ్యక్తి ప్రజలను మోసం చేశాడు. శుభక్షేత్ర వెంచర్ పేరుతో 31 మంది వద్ద రూ.6.58 కోట్లు వసూలు చేసి పరారు అయ్యాడు. అందులో మంగ్లీ పాత్ర ఉందని ఆరోపణలు వచ్చాయి. వాటిని ఆమె ఖండించారు. తనకు, తన సోదరుడికి దానితో ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. తన పేరును వాడుకున్నందుకు మధుపై కేసు నమోదు చేశారు.

Singer Mangli | బాధితుల ఫిర్యాదు మేరకు..

మంగ్లీతో పాటు ఈ కేసులో మోసపోయిన బాధితులు సైతం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు ఇటీవల రమావత్ మధును అరెస్ట్​ చేశారు. అనంతరం అతడి బ్యాంక్​ ఖాతా వివరాలు పరిశీలించగా.. సంచలన విషయాలు వెలుగు చూశాయి. రమావత్ మధు అకౌంట్ నుంచి మంగ్లీ సోదరుడు శివచౌహాన్ అకౌంట్‌కు మూడుసార్లు డబ్బు ట్రాన్స్​ఫర్​ చేసినట్టు పోలీసులు గుర్తించారు.

Singer Mangli | వెంటనే విత్​డ్రా

డబ్బులు పడిన తర్వాత రోజే నగదు విత్ డ్రా చేయడం గమనార్హం. ఇప్పటికే మధు అకౌంట్ సైబరాబాద్ EOW పోలీసులు సీజ్​ చేశారు. మధుతో పాటు హిమకాంత్‌రెడ్డి, శివచౌహాన్‌కు చెందిన అకౌంట్ల వివరాలు ఇవ్వాలని బ్యాంక్‌లకు లేఖ రాశారు. దీంతో ఈ వ్యవహారంలో మంగ్లీ పాత్ర సైతం ఉన్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. పోలీసుల విచారణలో అసలు నిజాలు తేలనున్నాయి.

ఇది కూడా చదవండి : Telangana Advisors | ‘సలహాదారుల’తో ఖజానాకు భారం.. అప్పుల రాష్ట్రంలో అదనపు ఖర్చు

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *