Modi Telangana Visit | తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటనపై పీసీసీ చీఫ్ కీలక వ్యాఖ్యలు..

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్:​ Modi Telangana Visit | తెలంగాణ (Telangana)లో ప్రధాని మోదీ పర్యటనపై పీసీసీ చీఫ్ బొమ్మ మహేష్​ కుమార్​ గౌడ్​ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు.

Modi Telangana Visit | బీజేపీ మొలకెత్తే పరిస్థితి లేదు..

పీసీసీ చీఫ్ (PCC Chief) మాట్లాడుతూ నరేంద్ర మోదీ దేశానికి కాకుండా కేవలం బీజేపీకి మాత్రమే ప్రధానిగా వ్యవహరిస్తున్నారన్నారు. తెలంగాణలో బీజేపీ మొలకెత్తే అవకాశం లేదన్నారు. అన్ని రాష్ట్రాలకు సమాన నిధులు ఇచ్చి ఆదుకోవాల్సిన ప్రధాని కేవలం రాజకీయాలు మాత్రమే మాట్లాడడం సమంజసం కాదన్నారు. ప్రధానికి రాష్ట్ర స్థితిగతులు బహుశా తెలియకపోవచ్చు అని పేర్కొన్నారు.

Modi Telangana Visit | తెలంగాణ కాంగ్రెస్​కు అనుకూలం..

తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్​కు అనుకూలమని ప్రత్యేక రాష్ట్రాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ (Congress Party)యేనని ఆయన మరోసారి గుర్తు చేశారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సంపూర్ణ మెజారిటీతో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి రావడం ఖాయమని పేర్కొన్నారు. పశ్చిమబెంగాల్​లో సెక్యులర్ల ఓట్లు పూర్తిగా తొలగించి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. తెలంగాణకు ప్రధాని ఎన్నిసార్లు వచ్చినా బీజేపీ (BJP) బలపడే అవకాశం లేదని ఆయన వ్యాఖ్యానించారు.

ఇది కూడా చదవండి..: Rashmi Gautam | బండి సంజయ్​ కుమారుడిపై పోక్సో కేసు.. రష్మీ సంచలన పోస్టు

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *