నిజామాబాద్Nizamabad Checkposts Inspection | అర్ధరాత్రి చెక్​పోస్టులను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య

Nizamabad Checkposts Inspection | అర్ధరాత్రి చెక్​పోస్టులను తనిఖీ చేసిన సీపీ సాయిచైతన్య

నిజామాబాద్ పోలీస్​ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్​పోస్టులను సీపీ సాయి చైతన్య అర్ధరాత్రి ఆకస్మికంగా తనిఖీ చేశారు.

అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Checkposts Inspection | నిజామాబాద్ పోలీస్​ కమిషనరేట్ పరిధిలో ఏర్పాటు చేసిన చెక్​పోస్టులను అర్ధరాత్రి సీపీ సాయి చైతన్య (CP Sai Chaitanya) తనిఖీ చేశారు. అక్కడి సిబ్బందితో మాట్లాడి భద్రత వివరాలను తెలుసుకున్నారు.

Nizamabad Checkposts Inspection | బక్రీద్​ నేపథ్యంలో..

బక్రీద్​ పండుగ (Bakrid Festival) నేపథ్యంలో కమిషనరేట్ పరిధిలో కందకుర్తి, జానకంపేట్​, పాల్ద, జన్నపల్లి ప్రాంతాలలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు. మూగజీవాల అక్రమ రవాణా కట్టడికి ఏర్పాటు చేసిన ఈ చెక్​పోస్టులలో సిబ్బంది వాహనాల రాకపోకలను నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా గురువారం అర్ధరాత్రి వీటిని తనిఖీ చేసిన సీపీ అక్కడి పోలీస్ అధికారులకు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని, మహారాష్ట్ర సరిహద్దుల నుంచి నిషేధిత పదార్థాలు, నగదు అక్రమ రవాణా, చట్ట విరుద్ధ కార్యకలాపాలపై నిఘా ఉంచాలని ఆయన పేర్కొన్నారు.

Nizamabad Checkposts Inspection | మర్యాదపూర్వకంగా వ్యవహరించాలి..

తనిఖీల సమయంలో వాహనదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని సీపీ సూచించారు. అనుమానాస్పద వ్యక్తులను వెంటనే అదుపులోకి తీసుకొని పూర్తి వివరాలు రాబట్టాలన్నారు. ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ అవసరమైతే సాంకేతిక పరికరాల సాయంతో తనిఖీలు చేపట్టాలని ఆదేశించారు. చెక్ పోస్ట్​ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బంది తమ భద్రత విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలని.. రిఫ్లెక్టర్ జాకెట్టు ధరించాలని సమన్వయంతో పనిచేయాలని పేర్కొన్నారు.

ఇది కూడా చదవండి..: TNGOs District Secretary | టీఎన్జీవోస్ కార్యాలయ కార్యదర్శిగా కుంట శ్రీనివాస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Share post:

Popular

More like this
Related

Mopal Police Arrest | ఉద్యోగులను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్న నిందితుడి అరెస్టు

అక్షరటుడే, డిచ్​పల్లి(మోపాల్): Mopal Police Arrest | నిజామాబాద్​ జిల్లా మోపాల్...

Jukkal MLA Comments | పోలీస్ vs ప్రజాప్రతినిధులు! అధికార పక్షంలో నివురుగప్పిన నిప్పులా ‘మాఫియా’ వివాదం

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Jukkal MLA Comments | తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు...

SRH vs RCB | IPL 2026: హైదరాబాద్ భారీ లక్ష్యం.. పవర్‌ప్లేలోనే ఆర్సీబీ కీలక వికెట్లు డౌన్!

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: SRH vs RCB | రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంలో...

NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్​ప్లాంట్స్​లో నిమ్స్​ అరుదైన రికార్డు.. 2K మైలురాయి పూర్తి

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: NIMS Kidney Transplants | కిడ్నీ ట్రాన్స్ ప్లాంట్స్...