అక్షరటుడే, కామారెడ్డి: Excise Constable Suspension | రహదారిపై వెళ్తున్న వాహనాలను నిలిపివేసి అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న ఎక్సైజ్ కానిస్టేబుల్ పై (Constable Suspension) సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు జిల్లా (kamareddy) ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి శుక్రవారం ప్రకటన విడుదల చేశారు.
Excise Constable Suspension | మద్నూర్ పరిధిలోని సలాబత్ పూర్..
ఈనెల 30న మద్నూర్ (Madnoor) పరిధిలోని సలాబత్ పూర్ (Salabatpur Checkpost) అంతర్రాష్ట్ర చెక్‌పోస్టు వద్ద ఎక్సైజ్ కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డి విధుల్లో ఉన్నాడు. అయితే ఆయన మరొక ప్రైవేట్ వ్యక్తితో కలిసి వచ్చిపోయే వాహనాలను నిలిపి డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. సదరు కానిస్టేబుల్ వసూళ్లకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ ముకుంద రెడ్డి స్పందించారు. ఘటనపై విచారణ జరిపి అతన్ని సస్పెండ్ చేయాలని కరీంనగర్ నోడల్ కార్యాలయానికి నివేదిక పంపించారు. శుక్రవారం కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డిని సస్పెండ్ చేస్తూ కరీంనగర్ నోడల్ అధికారి ఉత్తర్వులు జారీ చేసినట్లు ముకుంద రెడ్డి తెలిపారు. సంబంధిత ఉత్తర్వులు కానిస్టేబుల్ సుధాకర్ రెడ్డికి అందజేసినట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి : పెరుగుతున్న శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీటిమట్టం
Job lo nundi piki padeyali alanti vallani
Exise constable potta kottakandi SIR..Edo EMI కట్ట Daniki అడిగాడు miru చూసుకో పోతే ఎవరు చూస్తారు shhhhhh