అక్షరటుడే, ఇందూరు: Oora Panduga Festival | ఆషాఢ మాసంలో గ్రామదేవతలను ప్రత్యేకంగా పూజించడం ఆనవాయితీగా వస్తుందని.. దీంట్లో భాగంగానే ఊరపండుగ నిర్వహిస్తున్నామని అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ (MLA Dhanpal) సూర్యనారాయణ పేర్కొన్నారు. నగరంలో ఊర పండుగ రూట్‌మ్యాప్‌ను పరిశీలించారు.
Oora Panduga Festival | ఖిల్లా అమ్మవార్ల గద్దె వద్ద ఏర్పాట్ల పరిశీలన..
ఖిల్లా వద్ద అమ్మవార్ల గద్దె నుంచి గాజులపేట్, పెద్ద బజార్ మీదుగా వెళ్లే అమ్మవార్ల రూట్ మ్యాప్‌ను శుక్రవారం పరిశీలించారు. అలాగే మామిడి చెట్టు కర్రలతో నిష్ఠగా చేసే దేవతా మూర్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఈ నెల 2న ఇందూరులో సర్వసమాజ్ ఆధ్వర్యంలో ఊరపండుగ ఘనంగా నిర్వహిస్తున్నారని, ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తి చేస్తున్నారన్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకొని గద్దెను లక్ష్మీ బాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అదనపు నిర్మాణం చేపట్టినట్లు పేర్కొన్నారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా గద్దె ఎత్తును కూడా పెంచినట్లు తెలిపారు.
Oora Panduga Festival | ‘సరి’ వద్ద తోపులాట జరగకుండా..
అలాగే గాజుల పేటలో ‘సరి’ వద్ద ఎటువంటి తోపులాట జరగకుండా పోలీసు శాఖ గట్టి బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఆషాఢ మాసంలో తెలంగాణలో బోనాల పండుగ సాంప్రదాయంగా వస్తుందని వివరించారు. ఇందూరులో అన్ని కుల సంఘాలు ఐక్యంగా నిర్వహించుకునే అతిపెద్ద పండుగ ఊర పండుగ అన్నారు. వర్షాలు సమృద్ధిగా కురవాలని గ్రామదేవతలను కొలిచే సంప్రదాయం ఇందూరులో మాత్రమే ఉందన్నారు. కార్యక్రమంలో సర్వసమాజ్ కమిటీ ప్రతినిధులు బంటు రాజేశ్వర్, బీజేపీ కార్పొరేటర్లు నాగోల్ల లక్ష్మీనారాయణ, మల్కాయి మహేందర్, జగదీష్ కులకర్ణి, బంటు రాము, పసునూరి రాము, బెల్లాల్ శశాంక్, వైష్ణవి సుధా, కల్పే అర్చనా చిరంజీవి, జ్యోతి మురళి, ప్రసూన శ్రీనివాస్, ప్రీతి ప్రవీణ్, బొబ్బిలి సువర్ణ వేణుగోపాల్, ప్రసన్న శ్యామల సత్యపాల్ తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి..: Online Gaming Fraud | ఆన్‌లైన్ గేమింగ్ పేరుతో మోసం చేస్తున్న ఇద్దరు అరెస్ట్