అక్షరటుడే, నిజామాబాద్ క్రైం: Nizamabad Teacher Attack | టీచర్లపై దాడికి యత్నించిన ఘటనలో పోలీసులు పలువురిపై కేసు నమోదు చేశారు. ఈ ఘటన నిజామాబాద్ నగరంలోని రెండో టౌన్ పరిధిలో గురువారం చోటు చేసుకుంది.
Nizamabad Teacher Attack | గర్ల్స్ స్కూల్లో..
రెండో టౌన్ ఎస్హెచ్వో యాదగిరి గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరం (Nizamabad)లోని గర్ల్స్ స్కూల్లో గురువారం ఉదయం పదో తరగతి విద్యార్థిని ఛాతిలో నొప్పి రావడంతో ఉపాధ్యాయులు వెంటనే స్పందించి 108లో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ క్రమంలో టీచర్లు నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ విద్యార్థిని మేనమామ, మేనబావలు టీచర్లపై దుర్భాషలాడారు. వారి విధులకు ఆటకం కలిగించారు. చెప్పుతో కొడతామని టీచర్లకు బెదిరించడంతో వారు రెండో టౌన్లో ఫిర్యాదు చేశారు. దీంతో విచారించిన పోలీసులు అమ్మాయి బంధువులు పాల్ ఫిలిప్, దాస్, ఎబినేజర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి..: CP Sai Chaitanya | సీపీ సాయిచైతన్యకు రాఖీ కట్టిన బ్రహ్మకుమారీలు..