Farmers Protest Armoor | ఆర్మూర్​ సొసైటీకి తాళం వేసి రైతుల నిరసన

shashi kiran Mottala

అక్షరటుడే, ఆర్మూర్: Farmers Protest Armoor | రైతుల పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆలూర్​ రైతులు(Alur) ఆందోళన చేపట్టారు. ఆర్మూర్ (Armoor) పట్టణంలోని సొసైటీకి తాళం వేసి నిరసన తెలిపారు. అనంతరం సబ్ కలెక్టర్ అభిగ్యాన్​ మాల్వియాకు (Armoor Sub-Collector) వినతిపత్రం అందజేశారు.

Farmers Protest Armoor | ధాన్యం కొనుగోళ్లలో నిర్లక్ష్యమేలా..

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తుందన్నారు. జిల్లావ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో ధాన్యం కొనుగోలు చేసిన అనంతరం రైస్​మిల్లులకు తరలిస్తున్నారని కేవలం ఆర్మూర్ మండలం రాంపూర్ గ్రామంలో మాత్రం కొనుగోళ్లలో నిర్లక్ష్యం వహిస్తున్నారన్నారు. గ్రామంలో 7వేల బస్తాల ధాన్యం తూకం (Grain Weighing) వేసినప్పటికీ లారీలు లేక ఎక్కడ ధాన్యం అక్కడే రోడ్ల పైన పడి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

గ్రామంలో ఎక్కువ మంది దళితులే ఉన్నారని.. ప్రభుత్వం దళిత రైతుల పట్ల వివక్ష చూపుతోందని ఆరోపించారు. తక్షణమే సబ్ కలెక్టర్ రాంపూర్ గ్రామాన్ని సందర్శించి ధాన్యం కష్టాలను తీర్చాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షుడు మందుల బాలు, రాంపూర్ గ్రామ రైతులు తదితరులు పాల్గొన్నారు.

armoor

farmers protest armoor, paddy procurement issue, armur farmers news, telangana agriculture news, grain purchase delay, rampur village farmers, society office protest, bjp kisan morcha

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *