RTC Strike | నగరంలో ఆర్టీసీ కార్మికుల రాస్తారోకో.. రహదారుల దిగ్బంధనం

Srinivas Kolluri

అక్షరటుడే, నిజామాబాద్​ అర్బన్​: RTC Strike | ఉమ్మడిజిల్లాలో ఆర్టీసీ సమ్మె నిరవధికంగా కొనసాగుతోంది. నిజామాబాద్​ జిల్లా (Nizamabad District)లో రెండురోజులుగా కార్మికులు వివిధరకాలుగా నిరసన తెలుపుతున్నారు.

RTC Strike | నగరంలోని రాజారాజేంద్ర చౌరస్తా వద్ద..

జిల్లా కేంద్రంలోని రాజరాజేంద్ర చౌరస్తా వద్ద ఆర్టీసీ కార్మిక జేఏసీ ఆధ్వర్యంలో రాస్తారోకో చేశారు. న్యాల్​ కల్​ డిపో–2 నుంచి బస్సులు బయటకు రాకుండా అన్ని మార్గాలను దిగ్బంధనం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ.. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలన్నారు. ఇప్పటికే రాష్ట్రంలో పలువురు కార్మికులు ఆత్మహత్యాయత్నం చేశారని.. ప్రభుత్వం వెంటనే స్పందించి తమన డిమాండ్లను పరిష్కరించాలన్నారు. వరంగల్ జిల్లా (Warangal District) నర్సంపేటలో గురువారం మధ్యాహ్నం పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మరణించాడని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో మరో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేశాడన్నారు. భద్రాచలం (Badrachalam) ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్న డి.లింగారెడ్డి పురుగుల మందు తాగగా ఆయన పరిస్థితి విషమంగా ఉందన్నారు.

RTC Strike

ఇది కూడా చదవండి..: Nizamabad Railway Police | ప్రేమ విఫలమై.. రైలు కిందపడి యువకుడి ఆత్మహత్య..

 

తెలుగు మీడియాలో 9 ఏళ్ల అనుభవం ఉంది. 2016లో సాక్షి జర్నలిజం స్కూల్​లో చేరాను. అనంతరం సాక్షి దినపత్రిక కరీంనగర్​, నిజామాబాద్​ డెస్క్​లలో సబ్​ ఎడిటర్​గా పని చేశాను. 2025 ఫిబ్రవరి నుంచి ‘అక్షరటుడే’లో అసిస్టెంట్​ చీఫ్​ సబ్​ ఎడిటర్​గా విధులు నిర్వహిస్తున్నాను. జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ, సినిమా, క్రీడ, క్రైమ్​ ఆర్టికల్స్ రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *