Eagle Force | గంజాయిని సరఫరాపై ఈగల్​ ఫోర్స్​ ఉక్కుపాదం..ఏడాదిలో ఏడు టన్నుల గంజాయి స్వాధీనం

జిల్లావ్యాప్తంగా గంజాయి సరఫరాపై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం మోపుతోంది.

shashi kiran Mottala

అక్షరటుడే,నిజామాబాద్​ క్రైం​: Eagle Force | నిజామాబాద్​ జిల్లావ్యాప్తంగా (Nizamabad) గంజాయి సరఫరాపై ఈగల్ ఫోర్స్ (Eagle Force nizamabad) ఉక్కుపాదం మోపుతోంది. ఏడాది కాలం (2025‌‌–26) కాలంలో 7 టన్నుల వరకు గంజాయిని స్వాధీనం చేసుకుంది.

Eagle Force | పక్క సమాచారంతో దాడులు..

ఈ సందర్భంగా ఈగల్ ఫోర్స్ అధికారులు మాట్లాడుతూ.. గంజాయి సరఫరాను నిలువరించేందుకు ఈగల్ ఫోర్స్ ప్రత్యేకంగా ఏర్పాటైందన్నారు. 2025 నుంచి 2026 వరకు నార్కోటిక్స్ పోలీసులు 165 మంది డ్రగ్ గంజాయి వాడుతున్న వ్యక్తులను పట్టుకుని ఆయా పోలీస్ స్టేషన్​లలో అప్పగించారన్నారు.

వారిని డీ అడిక్షన్ సెంటర్లో జాయిన్ చేయడం జరిగిందన్నారు. అలాగే నార్కోటిక్స్ పోలీసుల ఆధ్వర్యంలో ఇప్పటివరకు 492 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు.

 యాంటీ ట్రాక్ సోల్జర్​గా..

కల్తీ కల్లు సంబంధించి 192 కార్యక్రమాలు ఏర్పాటు చేశామన్నారు. ముఖ్యంగా మునావర్​ అలీ, షేక్ అలీమా, గంధం శ్రీనివాస్ గౌడ్, మల్లెపూల లక్ష్మణ్ గౌడ్​లపై ఎన్డీపీఎస్​ యాక్ట్ అమలు చేసేందుకు పత్రాలు సిద్ధం చేస్తున్నామన్నారు.

ప్రజలందరూ యాంటీ ట్రాక్ సోల్జర్​గా పనిచేస్తూ ఎక్కడైనా గంజాయి అమ్మకాలు జరుగుతున్నట్లు తెలిస్తే 1908 కు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో ఈగల్ ఫోర్స్ జిల్లా అధికారి సోమనాదం తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: #KJQ Trailer Out Now

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *