Tyagaraja Atma Vicharam | త్యాగయ్య కీర్తనల ‘ఆత్మ విచారం’ ఆవిష్కరణ

ప్రపంచ ప్రసిద్ధ సంగీత బ్రహ్మ సద్గురు త్యాగరాజ స్వామి కీర్తనల విశిష్టతను తెలిపే అరుదైన గ్రంథం 'త్యాగరాజు ఆత్మవిచారం' మళ్లీ పాఠకుల ముందుకు వచ్చింది.

shashi kiran Mottala

అక్షరటుడే, భీమ్​గల్: Tyagaraja Atma Vicharam | ప్రపంచ ప్రసిద్ధ సంగీత బ్రహ్మ సద్గురు త్యాగరాజ స్వామి కీర్తనల విశిష్టతను తెలిపే అరుదైన గ్రంథం ‘త్యాగరాజు ఆత్మవిచారం’ మళ్లీ పాఠకుల ముందుకు వచ్చింది. జిల్లాలోని వేల్పూర్ మండలం (Velpur Mandal) మోతె గ్రామానికి చెందిన మాయాజూం ఫిలింస్ దర్శకులు అల్లపుల్ల గంగారెడ్డి, తన తండ్రి అల్లపుల్ల రాజులు 8వ వర్ధంతి సందర్భంగా ఈ గ్రంథాన్ని తిరిగి ముద్రింపజేశారు.

Tyagaraja Atma Vicharam | హైదరాబాద్​లోని కోకాపేట్​లో..

హైదరాబాద్ కోకాపేట్‌లో జరిగిన ఈ ఆవిష్కరణ కార్యక్రమంలో ఎస్‌ఆర్‌ ఫౌండేషన్‌ ఛైర్మన్, పారిశ్రామికవేత్త తిమ్మయ్యగారి సుభాష్‌రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని గ్రంథాన్ని ఆవిష్కరించారు. 1949లో ప్రచురితమైన ఈ అరుదైన తెలుగు గ్రంథం సుమారు 75 ఏళ్లుగా అందుబాటులో లేదు. దీని ప్రాముఖ్యతను గుర్తించిన గంగారెడ్డి, కాశీలోని బనారస్‌ హిందూ విశ్వవిద్యాలయం నుంచి దీనిని సేకరించి, ఎంతో వ్యయప్రయాసలకోర్చి తిరిగి ముద్రించారు. త్యాగయ్య కీర్తనల్లోని గాఢమైన భక్తి, లోతైన తత్వ చింతనను వచన రూపంలో విశ్లేషించే ఈ పుస్తకం, నేటి తరానికి ఒక నిధిగా నిలుస్తుందని అతిథులు కొనియాడారు.

Tyagaraja Atma Vicharam | సాంస్కృతిక వారసత్వం అందాలి..

ఈ సందర్భంగా సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. త్యాగరాజ స్వామి జీవితం, భక్తి తత్వం, కీర్తనల్లోని సందేశం నేటి తరానికి చేరాల్సిన అవసరం ఉందన్నారు. ఆధ్యాత్మిక గ్రంథాల పునర్ముద్రణ ద్వారా మన సాంస్కృతిక వారసత్వాన్ని భావితరాలకు అందించవచ్చని పేర్కొన్నారు. గతంలో ‘లోపలి దారి’ పుస్తకాన్ని, ఇప్పుడు ఈ గ్రంథాన్ని ప్రచురించడం ద్వారా గంగారెడ్డి చూపిస్తున్న ఆధ్యాత్మిక చింతన, సహృదయత అభినందనీయమన్నారు.

Tyagaraja Atma Vicharam | సాహితీ, సంగీత మయంగా..

Tyagaraja Atma Vicharam

కార్యక్రమంలో మాజీ ఐఏఎస్ అధికారి, కవి వాడ్రేవు చినవీరభద్రుడు గ్రంథాన్ని పరిచయం చేస్తూ ప్రపంచ సంగీత సాహిత్యాల్లో త్యాగరాజు కీర్తనల గొప్పతనాన్ని వివరించారు. ప్రముఖ సంగీత విద్వాంసులు మల్లాది రవికుమార్ త్యాగయ్య కీర్తనలను శ్రావ్యంగా ఆలపించి, వాటిలోని భక్తి తత్వాన్ని విశదీకరించారు. నంది అవార్డు గ్రహీత, సినీ గేయ రచయిత మిట్టపల్లి సురేందర్ ప్రత్యేక అతిథిగా పాల్గొని పాటలు పాడారు. ఈ కార్యక్రమంలో కవులు రమణ జీవి, ప్రసాదమూర్తి, వసీరాతో పాటు పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. చివరగా అరుదైన గ్రంథాన్ని పునర్ముద్రించిన గంగారెడ్డిని సుభాష్‌రెడ్డి అభినందించగా, విద్వాంసులు మల్లాది రవికుమార్‌ను ఘనంగా సన్మానించారు.

ఇది కూడా చదవండి..: Telangana University | విద్యార్థులతో తెయూ చెలగాటం.. ఒకే రోజు నెట్–బీఈడీ పరీక్షలతో గందరగోళం..

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
1 Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *