Eatala Rajender HYDRAA | హైడ్రాకు దమ్ముంటే బడా బాబులను జైల్లో పెట్టండి: రాజేందర్ ఈటల

హైదరాబాద్‌లోని బోయినపల్లి, అస్మత్‍పేట ప్రాంతాల్లో హైడ్రా (HYDRA) చేపట్టిన ఇళ్ల కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

shashi kiran Mottala

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Eatala Rajender HYDRAA | హైదరాబాద్‌లోని బోయినపల్లి, అస్మత్‍పేట ప్రాంతాల్లో హైడ్రా (HYDRA) చేపట్టిన ఇళ్ల కూల్చివేతలపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదల ఇళ్లను కూల్చివేయడం దుర్మార్గమని పేర్కొన్న ఆయన, అసలైన కబ్జాదారులను వదిలేసి నోరులేని పేదలపై ప్రతాపం చూపడంపై మండిపడ్డారు. కూల్చివేతలు ఆపకపోతే రాబోయే రోజుల్లో ప్రజలే ఈ ప్రభుత్వాన్ని కూల్చేస్తారని ఆయన హెచ్చరించారు.

Eatala Rajender HYDRAA | పేదలపై కక్ష సాధింపు..

హైడ్రాకు నిజంగా దమ్ముంటే భూములను కబ్జా చేసిన బడా నాయకులను, వారికి సహకరించిన అధికారులను జైల్లో పెట్టాలని ఈటల (Eatala Rajener) సవాల్ విసిరారు. ప్రభుత్వ భూముల్లో లే-అవుట్లు వేయడానికి అనుమతించిన వారిపై చర్యలు తీసుకోకుండా, పేదలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదన్నారు. రాజకీయ నాయకుల పేర్లు ఎత్తే ధైర్యం లేని హైడ్రా, బాధితులు కోర్టుకు వెళ్లకుండా అడ్డుకునేందుకు శని, ఆదివారాల్లోనే కూల్చివేతలు చేపట్టడం దారుణమని ఆరోపించారు.

Eatala Rajender HYDRAA | ప్రభుత్వ వైఖరిపై ప్రశ్నలు..

గతంలో పేదల ఇళ్లను క్రమబద్ధీకరిస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం, ఇప్పుడు వారి బతుకులను రోడ్డున పడేస్తోందని ఈటల ధ్వజమెత్తారు. “ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీరు ఇలాగే ఉంటే నగరంలో ఏ ఒక్క బస్తీ మిగలదు. 70 ఏళ్లుగా ఇలాంటి పాలన ఉంటే సామాన్యులు ఎలా బతికేవారు?” అని ఆయన ప్రశ్నించారు. ప్రజల ఆస్తులను కాపాడాల్సిన ప్రభుత్వమే వారి కడుపు కొట్టడం సిగ్గుచేటని విమర్శించారు.

Eatala Rajender HYDRAA | అవినీతిపై ధ్వజం..

Eatala Rajender HYDRAA

రెవెన్యూ శాఖలో అవినీతి పరాకాష్టకు చేరిందని ఈటల ఆరోపించారు. ఇటీవల జరిగిన ఏసీబీ దాడుల్లో అధికారుల ఇళ్ల నుంచి నోట్ల కట్టలు బయటపడుతున్నాయని, వ్యవస్థ అంతా అవినీతిమయం అయిందని ఆయన మండిపడ్డారు. పేదలకు అన్యాయం చేస్తున్న ప్రభుత్వం, ముందుగా ఈ అవినీతిపరులైన అధికారుల సంగతి చూడాలని ఆయన డిమాండ్ చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెబుతారని ఈటల హెచ్చరించారు.

ఇది కూడా చదవండి..: RM1 Coders Hub Scam | బ్యాక్‌డోర్ జాబ్స్ పేరుతో భారీ స్కామ్.. రూ. 5 కోట్లు టోకరా

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *