Ireni Sandeep Congress | కాంగ్రెస్ కామారెడ్డి పట్టణ అధ్యక్షుడిగా ఐరేని సందీప్

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Ireni Sandeep Congress | కామారెడ్డి జిల్లా కేంద్రానికి చెందిన ఐరేని సందీప్​ను కాంగ్రెస్ కామారెడ్డి (Kamareddy) పట్టణ అధ్యక్షుడిగా నియమిస్తూ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీని కలిసి తనపై నమ్మకంతో పార్టీ పట్టణ అధ్యక్షుడిగా నియమించిన టీపీసీసీ (TPCC)–ఇన్​ఛార్జి మీనాక్షి నటరాజన్, షబ్బీర్ అలీలకు (Shabbir Ali) కృతజ్ఞతలు తెలిపారు. ఐరేని సందీప్ పార్టీ అనుబంధ యూనియన్ అయిన ఎన్ఎస్​యూఐ(NSUI) జిల్లా అధ్యక్షుడిగా కొనసాగారు. విద్యార్థి సంఘ నాయకుడిగా అలుపెరగని పోరాటం చేశారు. నాటి అధికార పార్టీ నాయకులు ఎన్ని ఒత్తిళ్లు చేసినా పార్టీని వదిలి పెట్టలేదు. కామారెడ్డి డిగ్రీ కళాశాల ఆస్థుల విషయంలో కీలక పాత్ర పోషించారు. అరెస్టులు, లాఠీ దెబ్బలు తిన్నారు.

Ireni Sandeep Congress | కాంగ్రెస్​ పార్టీ అధికారంలోకి వచ్చాక..

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చాక పార్టీలో సముచిత స్థానం కల్పిస్తారని ఐరేని సందీప్​ ఆశించారు. విద్యార్థి నాయకుడిగా సుదీర్ఘ కాలం కొనసాగిన సందీప్ జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మన్ పదవిని ఆశించారు. అయితే ఆ పదవి భిక్కనూరుకు (Bhikkanoor) చెందిన మద్ది చంద్రకాంత్ రెడ్డికి దక్కింది. పార్టీకి సేవలందించిన సందీప్​కు సముచిత స్థానం తప్పకుండా లభిస్తుందని షబ్బీర్అలీ భరోసా ఇచ్చారు. ఇటీవల కామారెడ్డి ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆస్తుల విషయంలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణారెడ్డితో (MLA Katipally Venkata Ramana Reddy) ఢీ అంటే ఢీ అంటూ సవాళ్లు చేశారు.

Ireni Sandeep Congress | ఎమ్మెల్యే వర్సెస్ సందీప్

ఎమ్మెల్యే వర్సెస్ సందీప్​ వార్​ కొనసాగింది. ఇద్దరి మధ్య బహిరంగ సవాళ్లతో కామారెడ్డి అట్టుడికింది. ఈ సమయంలోనే సందీప్ పేరు రాష్ట్రవ్యాప్తంగా పేరు గాంచింది. ఇటీవల డీసీసీ నూతన కమిటీ ఏర్పాటైంది. దాంతో ఈ కమిటీలోనే సందీప్​కు పట్టణ అధ్యక్షుడిగా అవకాశం లభిస్తుందని అందరూ భావించారు. అయితే పార్టీలోనే కొందరు అడ్డుపడ్డారన్న ప్రచారం సాగింది. చివరికి అదే పదవి దక్కింది. దాంతో ఇన్నేళ్ల నిరీక్షణకు ఉన్నత స్థానం లభించిందని భావిస్తున్నారు.

ఇది కూడా చదవండి: Madan Mohan Rao | కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

 

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *