Kamareddy Psycho Incident | కటర్​తో సైకో వీరంగం.. భయాందోళనకు గురైన ప్రజలు

Shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Psycho Incident | చేతిలో కటర్​తో (cutter attack) ఓ సైకో వీరంగం సృష్టించాడు. అతడి తీరుతో ఎవరికి ప్రమాదం జరగకపోయినా ప్రజలు భయాందోళనకు గురయ్యారు. ఈ ఘటన కామారెడ్డి (Kamareddy) పట్టణంలోని జీజీహెచ్​ ఎదురుగా ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది.

Kamareddy Psycho Incident | రోడ్డుపై అటుఇటూ తిరుగుతూ..

జీజీహెచ్​ (GGH Kamareddy) వద్ద సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి చేతిలో కటర్ పట్టుకుని రోడ్డుపై అటూఇటూ తిరుగుతూ అరుస్తూ వచ్చేపోయే వాహనదారులు, ప్రజలకు కటర్ చూపిస్తూ భయాందోళనకు గురి చేశాడు. దాంతో నడుచుకుంటూ వెళ్లే మహిళలు, చిన్నారులు అతని చేష్టలకు భయపడ్డారు. కటర్ ఎక్కడ తమకు గుచ్చుకుంటుందోనని ఆందోళనకు గురయ్యారు. అయితే అతను మతిస్థిమితం లేక సైకోగా ప్రవర్తిస్తాడని, అతడిని ఎవరూ పెద్దగా పట్టించుకోరని ఆస్పత్రి వద్ద వ్యాపారులు తెలిపారు.

ఇది కూడా చదవండి: Madan Mohan Rao | కాంగ్రెస్ పార్టీతోనే అభివృద్ధి సాధ్యం : ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు

Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *