Kamareddy Rain Alert | సెల్ఫీల కోసం ప్రాణాలు తీసుకోవద్దు: ఎస్పీ రాజేష్ చంద్ర

సెల్ఫీలు, వీడియోల కోసం వాగులు, కల్వర్టులు, చెరువుల వద్దకు వెళ్లి ప్రాణాలను పణంగా పెట్టవద్దని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు.

shashi kiran Mottala

అక్షరటుడే, కామారెడ్డి: Kamareddy Rain Alert | సెల్ఫీలు, వీడియోల కోసం వాగులు, కల్వర్టులు, చెరువుల వద్దకు వెళ్లి ప్రాణాలు తీసుకోవద్దని కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర (SP Rajesh Chandra) అన్నారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల(Heavy Rain Telangana) నేపథ్యంలో మంగళవారం ఆయన పట్టణంలోని(Kamareddy) పెద్ద చెరువు, జీఆర్ కాలనీ బ్రిడ్జి ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు.

Kamareddy Rain Alert | ప్రజలు అప్రమత్తంగా ఉండాలి..

జిల్లావ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తల్లిదండ్రులు చిన్నారులపై ప్రత్యేక నిఘా ఉంచాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని కోరారు. వరద ప్రభావిత ప్రాంతాలు, చెరువులు, రద్దీ కూడళ్ల వద్ద అవసరమైన చోట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. అధికారులందరూ ఫీల్డ్‌లోనే ఉండి నిరంతరం పరిస్థితిని పర్యవేక్షించాలని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

భారీవర్షాలు కొనసాగుతున్నందున ఏదైనా అత్యవసర పరిస్థితి ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌ను లేదా డయల్-100ను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. డీఎస్పీ మధుసూధన్, టౌన్ సీఐ నరహరి, రూరల్ సీఐ శ్రీధర్, ఎస్‌ఐలు రంజిత్, చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఇది కూడా చదవండి: పొంగిపొర్లుతున్న పోచారం ప్రాజెక్టు 

తెలుగు జర్నలిజంలో 20 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2005లో ‘వార్త’ దినపత్రికలో స్పోర్ట్స్​ రిపోర్టర్​గా పనిచేశాను. అనంతరం రెండేళ్ల పాటు సబ్​ఎడిటర్​గా విధులు నిర్వహించాను. 2010లో ‘సాక్షి’ జర్నలిజం స్కూల్​లో శిక్షణ పొందాను. అనంతరం ‘సాక్షి’ దినపత్రికలో సబ్​ఎడిటర్​గా చేరాను. సీనియర్​ సబ్​ ఎడిటర్​గా ప్రమోషన్​ పొందాను. 2024 నవంబర్​ నుంచి ‘అక్షరటుడే’లో చీఫ్​ సబ్​ ఎడిటర్​గా పనిచేస్తున్నాను. పొలిటికల్​, స్థానికం, జనరల్​, క్రైం, వైరల్​ ఆర్టికల్స్​ ఎక్కువగా రాస్తుంటాను.
2 Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *