Udhayanidhi Stalin Arrest | చెన్నైలో తీవ్ర ఉద్రిక్తత.. ఉదయనిధి అరెస్ట్‌పై డీఎంకే ఫైర్

నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో భారీ కలకలం రేపాయి.

Shivam nagarani

అక్షరటుడే వెబ్‌డెస్క్: Udhayanidhi Stalin Arrest | నటి త్రిషపై డీఎంకే నేత ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తమిళనాడు రాజకీయాల్లో భారీ కలకలం రేపాయి. ఆయన వ్యాఖ్యలను అన్ని రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఉదయనిధిని అరెస్ట్ చేసి, విచారణ నిమిత్తం తంజావూరు పోలీస్ స్టేషన్‌కు తరలించారు. రాజకీయ పక్షాలన్నీ ఈ అరెస్ట్‌ను స్వాగతించగా.. డీఎంకే ( DMK )మాత్రం ఇది ప్రభుత్వ అణచివేత చర్య అని మండిపడింది. ఈ పరిణామాల మధ్య చెన్నైలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో, మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.

పోలీసులు తనను ఇంటివద్దే అదుపులోకి తీసుకుంటున్న సమయంలో ఉదయనిధి నవ్వుతూ కనిపించారు. ఏ పరిణామానికైనా తాను భయపడబోనని, ఇదంతా తనకు ఒక జోక్‌లా కనిపిస్తోందని వ్యాఖ్యానించడం గమనార్హం.

Udhayanidhi Stalin Arrest | బీజేపీ, ఇతర నేతల విమర్శలు..

సనాతన ధర్మంపై గతంలో అనుచిత వ్యాఖ్యలు చేసినందుకే ఆయనకు ఈ గతి పట్టిందని బీజేపీ నేత అమిత్ మాలవీయ విమర్శించారు. ఒక మహిళను ఉద్దేశించి అభ్యంతరకరంగా మాట్లాడినందుకే అరెస్టయ్యారని మండిపడ్డారు. ఎండీఎంకే జనరల్ సెక్రటరీ వైగో మాట్లాడుతూ.. రాజకీయ హద్దులు దాటి ఇతరుల గౌరవానికి భంగం కలిగేలా ఉదయనిధి మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ స్పందిస్తూ.. మాజీ ఉపముఖ్యమంత్రి స్థాయికి ఆ మాటలు తగవని, అదే సమయంలో విజయ్ ప్రభుత్వం హడావుడిగా అరెస్ట్ చేయడాన్ని కూడా తప్పుపట్టారు.

Udhayanidhi Stalin Arrest | డీఎంకే వాదన ..

ఉదయనిధి ప్రసంగంలో ఎలాంటి అవమానకరమైన అంశాలు లేవని డీఎంకే నేతలు స్పష్టం చేస్తున్నారు. ఆయన ఎక్కడా త్రిష పేరే ప్రస్తావించలేదని డీఎంకే నేత టీకేఎస్ ఎళంగోవన్ తెలిపారు. ఉదయనిధిపై వ్యక్తిగతంగా కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని డీఎంకే నాయకురాలు కనిమొళి విమర్శించారు. రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ఆయన పాల్గొనకుండా అడ్డుకునేందుకే ప్రభుత్వం ఈ పిరికిపంద చర్యకు పాల్పడిందని, డీఎంకేను ఎదుర్కోలేక ఇలాంటి చట్టవిరుద్ధ అరెస్టులు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇది కూడా చదవండి:  Kamareddy Heavy Rain | అర్ధరాత్రి వర్షబీభత్సం.. కొట్టుకుపోయిన రోడ్లు.. ఇళ్లలోకి చేరిన నీరు

Follow:
Author Bio: శివం నాగరాణి గత 5 సంవత్సరాలుగా తెలుగు వార్తా రంగంలో పనిచేస్తున్నారు. కందిలి దినపత్రికలో జర్నలిస్ట్‌గా పని చేశారు. ప్రస్తుతం అక్షర టుడే వెబ్‌సైట్‌లో లైఫ్‌స్టైల్, ఆధ్యాత్మికం, ఆరోగ్యం, విద్య, ఉద్యోగాలు, ప్రభుత్వ పథకాలు, బిజినెస్, పర్సనల్ ఫైనాన్స్‌వంటి అంశాలపై వార్తలను అందిస్తున్నారు.
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *